బ్లాక్ అవుట్ ఫిట్ లో హొయలుపోతున్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో.. అందంతో అభిమానులనే కాదు స్టార్ సెలబ్రిటీలను కూడా ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.;
మిల్కీ బ్యూటీ తమన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో.. అందంతో అభిమానులనే కాదు స్టార్ సెలబ్రిటీలను కూడా ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేసే ఈమె తాజాగా ఫెమినా బి అన్ స్టాపబుల్ అనే మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం స్పెషల్ గా ఇచ్చిన ఫోటోషూట్ అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది. తాజాగా షేర్ చేసిన ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటోలలో బ్లాక్ అవుట్ ఫిట్ లో చాలా అందంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా బ్లాక్ కలర్ మేని ఛాయను రెట్టింపు చేస్తుంది అని ఇప్పటికే శృతిహాసన్ లాంటి ఎంతోమంది తారలు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అటు శృతిహాసన్ కూడా బ్లాక్ కలర్ దుస్తులను ఎక్కువగా ధరిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను తమన్నా కూడా పాటిస్తోందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈమె ధరించిన బ్లాక్ అవుట్ ఫిట్ కూడా ఈమె మేని ఛాయను మరింత రెట్టింపు చేసింది అనడంలో సందేహం లేదు. మొత్తానికైతే తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.
తమన్నా విషయానికి వస్తే.. తమన్నా అసలు పేరు తమన్నా సంతోష్ భాటియా.. 1989 డిసెంబర్ 21న బొంబాయిలో జన్మించిన ఈమె 13 సంవత్సరాల వయసులోనే నటన నేర్చుకోవడం ప్రారంభించింది. అలా పృథ్వీ థియేటర్లో ఒక సంవత్సరం పాటు నటన నేర్చుకున్న ఈమె.. రంగస్థల ప్రదర్శనలలో కూడా పాల్గొనింది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును తమన్నాగా మార్చుకుంది. 2005లో తొలిసారి హిందీ చిత్రమైన చాంద్ షా రోషన్ చెహ్రా అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. తెలుగులో శ్రీ అనే సినిమాతో అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కేడి అనే సినిమాతో అటు తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది.
ఇకపోతే శ్రీ సినిమాతో పెద్దగా గుర్తింపు లభించలేదు కానీ హ్యాపీడేస్ సినిమాతో ఊహించని పాపులారిటీ అందుకుంది. ఇందులో కళాశాల విద్యార్థినిగా తన పాత్రతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ , ఊసరవెల్లి, ఎందుకంటే ప్రేమంట, రెబల్, తడాఖా ఇలా ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన నటనతో సైమా క్రిటిక్స్ అవార్డును కూడా దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లు , వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతున్న తమన్నా తాజాగా హిందీలో వరుస సినిమాలను చేస్తోంది. తాజాగా జయశ్రీ బయోపిక్ లో సినిమా చేస్తోంది. అలాగే మరో హిందీ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది.