నిధిని పెళ్లి చేసుకోవాలంటే ఆస్తి ఎంత ఉండాలి?
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఆ కార్యక్రమంలో ప్రభాస్, దర్శకుడు మారుతి, చిత్ర యూనిట్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు.;
హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో ఓ రేంజ్ లో క్రేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా.. జనవరి 9వ తేదీన విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఆ కార్యక్రమంలో ప్రభాస్, దర్శకుడు మారుతి, చిత్ర యూనిట్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు. అయితే ఆ వేడుకలో ఓ అభిమాని చేసిన పని అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్టింట వైరల్ గా మారింది.
నిధి అగర్వాల్ ను ఉద్దేశిస్తూ ఆ అభిమాని ఓ ప్లకార్డ్ పట్టుకుని ఆడియన్స్ లో నిలబడ్డాడు. అందులో “నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి? ఎంత ఆస్తి ఉండాలి? ఎలా ఉండాలి?” అని రాసి ఉంది. ఆ ప్లకార్డ్ చూసిన ప్రభాస్ సహా వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. యాంకర్ సుమ కూడా అబ్జర్వ్ చేశారు.
దీంతో ఇంకేముంది.. వెంటనే అదే అంశాన్ని సరదాగా నిధి అగర్వాల్ వద్ద ప్రస్తావించారు సుమ. దానికి నిధి అగర్వాల్ కూడా ఎంతో స్పోర్టివ్ గా రెస్పాండ్ అయ్యారు. ప్రొఫెషన్ ఆఫ్ లవ్ లో ఉండాలంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణం అంతా చప్పట్లు, హర్షధ్వానాలతో మార్మోగిపోయింది.
ముఖ్యంగా నిధి అగర్వాల్ ఇచ్చిన ఆన్సర్ అభిమానులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి. అయితే ఆమె మాట్లాడిన తర్వాత సుమ మరోసారి సరదాగా స్పందించారు. చీరలోనే అన్ని నిధులు కూడా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. సుమ చేసిన ఆ కామెంట్ కు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున విజిల్స్, చప్పట్లు వినిపించాయి.
అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. నిధి అగర్వాల్ స్పోర్టివ్ ఆన్సర్ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో సుమ కామెడీ సెన్స్ కూడా సూపర్ అని అభిమానులు చెబుతున్నారు.
అయితే ది రాజా సాబ్ లో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా నిధి అగర్వాల్ కెరీర్ కు రాజా సాబ్ మరో టర్నింగ్ పాయింట్ గా మారుతుందనే నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరి నిధి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.