ఇయర్ ఎండ్ లో టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ హీరోయిన్ దొరికినట్టేనా?

ఇప్పుడు ఈ జాబితాలోకి మరో యంగ్ హీరోయిన్ వచ్చి చేరింది. అంతేకాదు ఈమె నటన చూసి టాలీవుడ్ కి ఒక కొత్త హీరోయిన్ దొరికినట్లే అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.;

Update: 2025-12-28 05:10 GMT

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువ అని చెప్పాలి. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రతి ఒక్క హీరోయిన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో సక్సెస్ అయితేనే సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం ఉంటుంది. లేకపోతే కొత్త హీరోయిన్లు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎంతోమంది కుర్ర హీరోయిన్లు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో సరికొత్త విజయాలను సొంతం చేసుకుంటూ తమకంటూ పునాదులు వేసుకుంటున్నారు.



 


అలా ఈ ఏడాది ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో యంగ్ హీరోయిన్ వచ్చి చేరింది. అంతేకాదు ఈమె నటన చూసి టాలీవుడ్ కి ఒక కొత్త హీరోయిన్ దొరికినట్లే అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఆమె ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత కాలంలో భాషతో సంబంధం లేకుండా చాలామంది హీరోలు ఇతర భాషలలో కూడా సినిమాలు చేసి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రం ద్వారా మలయాళ కుట్టి అనస్వర రాజన్ కూడా తెలుగు తెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి వారు కూడా ఛాంపియన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమెపై పొగడ్తల వర్షం కురిపించడమే కాకుండా ఈమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం గురించి కూడా ఆయన వర్ణించారు. అయితే రామ్ చరణ్ అనస్వర రాజన్ గురించి కామెంట్లు చేసినప్పుడు చాలామంది నమ్మలేదు.

కానీ క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఛాంపియన్ సినిమాలో ఆమె నటన, లుక్స్ , డాన్సులో చలాకీగా నర్తించడం లాంటివన్నీ చూసిన తర్వాత రష్మిక, సమంత, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ తో ఈమెను పోలుస్తూ ఉండడం గమనార్హం. అలా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇతర స్టార్ హీరోల సినిమాలలో కూడా ఇప్పుడు ఈమెకు అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది అని ఛాంపియన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఒక్క సినిమాతో మంచి విజయం అందుకొని ఇప్పుడు తెలుగు తెరకు మరో కొత్త హీరోయిన్ గా అవతరించింది అనస్వర రాజన్.

అనస్వర రాజన్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే..2017లో వచ్చిన ఉదాహరణం సుజాత అనే సినిమాలో మంజు వారియర్ కూతురుగా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. 2019లో వచ్చిన తన్నీర్ మథన్ దినంగల్ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈమె కెరియర్ కాస్త మలుపు తిరిగింది. ఇక 2023 లో మోహన్ లాల్ నేరు సినిమాలో అంధురాలి పాత్రతో మంచిగుర్తింపుని అందుకుంది ఈ ముద్దుగుమ్మ..ఈ సినిమాతో మలయాళంలో ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె నటించిన అబ్రహం ఓజ్లర్ , గురువాయూర్ అంబలనాదయిల్ ఇలా చేసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ సాధించడంతో ఛాంపియన్ సినిమాలో అవకాశం లభించింది. మొత్తానికి అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించేలా డైరెక్టర్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News