ప్ర‌భాస్ పిల‌క లుక్ వెన‌క టాప్ సీక్రెట్

ప్ర‌స్తుతం స్పిరిట్ షూటింగ్‌ వేగంగా పూర్త‌వుతోంది. డార్లింగ్ సెట్లో బిజీబిజీగా ఉన్నాడు. `ది రాజా సాబ్` ఈవెంట్ కోసం నేరుగా అత‌డు `స్పిరిట్` షూట్ ముగించుకుని వ‌చ్చాన‌ని చెప్పాడు.;

Update: 2025-12-28 04:01 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ చాలా కాలం త‌ర్వాత నేరుగా త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రించారు. `ది రాజా సాబ్` ప్రీరిలీజ్ వేదిక సాక్షిగా వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానుల‌కు అభివాదం చేసిన ప్రభాస్ `డార్లింగ్స్` అని పిలుస్తూ, అంద‌రిలో ఉత్సాహం నింపాడు. ఆ స‌మ‌యంలో త‌న కొత్త (పిల‌క) లుక్ వెన‌క టాప్ సీక్రెట్ ని కూడా రివీల్ చేసేసాడు.

ప్ర‌భాస్ `ది రాజా సాబ్` షూటింగ్ పూర్తి చేసిన త‌ర్వాత హను రాఘ‌వ‌పూడితో` ఫౌజి` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలోని స్పిరిట్ చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ప్ర‌స్తుతం స్పిరిట్ షూటింగ్‌ వేగంగా పూర్త‌వుతోంది. డార్లింగ్ సెట్లో బిజీబిజీగా ఉన్నాడు. `ది రాజా సాబ్` ఈవెంట్ కోసం నేరుగా అత‌డు `స్పిరిట్` షూట్ ముగించుకుని వ‌చ్చాన‌ని చెప్పాడు.

అంతేకాదు.. ఈ పిల‌క లుక్ కొత్త సినిమా కోస‌మేన‌ని చెప్పాడు. వేదిక‌పైకి వ‌చ్చిన సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.థ‌మ‌న్ కూడా ప్ర‌భాస్ పిల‌క లుక్ అద్భుతంగా ఉంది! అంటూ కితాబిచ్చారు. మునుప‌టితో పోలిస్తే ప్ర‌భాస్ ఇప్పుడు మ‌రింత ఫిట్ గా మారాడు. 46 వ‌య‌సులో డార్లింగ్ హార్డ్ హిట్ట‌ర్‌లా క‌నిపిస్తున్నాడు. `స్పిరిట్` చిత్రంలో అత‌డు సీరియ‌స్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇది యాక్ష‌న్‌ని మ‌రో లెవ‌ల్ లో ఆవిష్క‌రించే చిత్రం అని కూడా ప్ర‌చార‌మ‌వుతోంది. సందీప్ వంగా మార్క్ ఇంటెన్స్ క్యారెక్ట‌రైజేష‌న్ ప్ర‌భాస్ ని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రించ‌నుంది. అత‌డు ప్ర‌భాస్ ని అత్యంత భావోద్వేగభ‌రిత‌మైన పాత్ర‌లో చూపించ‌బోతున్నాడు. అందుకే లుక్ ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిసింది.

`ది రాజా సాబ్` ఈవెంట్లో ప్ర‌భాస్ కి యాంక‌ర్ సుమ నుంచి కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. అందులో సందీప్ రెడ్డి వంగా గురించి ఒక్క మాట‌లో చెప్పాల్సిందిగా ప్ర‌భాస్ ని కోరారు సుమ. దానికి అత‌డు స్పందిస్తూ, `క‌ల్ట్- నేటిత‌రం ద‌ర్శ‌కుడు` అంటూ ప్ర‌భాస్ కితాబిచ్చాడు. ఆ స‌మ‌యంలో సందీప్ రెడ్డి వంగా పేరు వినిపించ‌గానే ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో పూన‌కాలు పుట్టుకొచ్చాయి. పెద్ద ఎత్తున శ‌బ్ధాలు చేస్తూ వేదిక వ‌ద్ద ఫ్యాన్స్ ద‌ద్ద‌రిల్లే వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేయ‌డం ఈ మూవీపై ఉన్న బ‌జ్ ని కూడా చెబుతోంది.

`స్పిరిట్` సినిమా తారాగణం, కథాంశం వివ‌రాల్లోకి వెళితే.. ఇది ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో భారీ పాన్ ఇండియ‌న్ చిత్రం. భార‌త‌దేశంలో అత్యంత క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా ఉన్న సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు న‌టిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్, యానిమ‌ల్ చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన సందీప్ రెడ్డి వంగా ఈసారి ప్ర‌భాస్ తో మ‌రో భారీ పాన్ ఇండియ‌న్ (వ‌రల్డ్) సినిమాని రూపొందిస్తున్నారు. స్పిరిట్ చిత్రంలో ప్ర‌భాస్ ని ఠఫ్ కాప్ పాత్ర‌లో చూపిస్తున్నార‌ని ఇప్ప‌టికే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తాజా లీకుల ప్ర‌కారం.. ఈ కథాంశం క్రూరమైన అంతర్జాతీయ నేరాల సిండికేట్‌ను నిర్మూలించాలనే దృఢ సంకల్పంతో, అవ‌మానం, క‌సితో ర‌గిలిపోయే ఐపీఎస్ అధికారిగా ప్ర‌భాస్ క‌నిపిస్తారు. తీవ్ర‌మైన అవ‌మానం ఎదుర్కొన్న త‌ర్వాత తిరిగి తన గౌరవాన్ని పొందాలనే లక్ష్యం సిన్సియ‌ర్ ఐపీఎస్ అధికారిని రాజీలేని, అత్యంత క్రూరుడైన వాడిగా మారుస్తుంది. వ‌రుస‌ ప‌రిణామాల క్ర‌మంలో అత‌డు హై-ఆక్టేన్- ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లోకి మారతాడు. ఆ త‌ర్వాత విధ్వంశం ఎలా ఉంటుందో తెర‌పైనే చూడాలని చెబుతున్నారు.

`యానిమల్` తర్వాత దర్శకుడు సందీప్ వంగాతో కలిసి ప‌ని చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది ట్రిప్టి దిమ్రీ. ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియ‌న్ స్టార్ స‌ర‌స‌న జాక్ పాట్ అందుకుంది. అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో విధి నిర్వ‌హ‌ణ‌లో ఉండే అధికారి (ప్రభాస్)తో ప్రేమలో పడే వైద్యురాలి పాత్రను ట్రిప్తి పోషిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ట్యాలెంటెడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.

`ఎ ట్రైన్ టు బుసాన్`, `ఎటర్నల్స్` చిత్రాలతో పాపుల‌రైన కొరియన్ నటుడు డాన్ లీ (మా డాంగ్-సియోక్) ప్రధాన విల‌న్ గా న‌టిస్తార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. సందీప్ వంగా నటీనటుల ఎంపిక ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఎలివేష‌న్ తో ముందుకు తీసుకెళుతోంద‌ని కూడా అర్థమ‌వుతోంది. టి-సిరీస్ -భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాయి. మొత్తం తొమ్మిది భాషల్లో పాన్ వ‌ర‌ల్డ్ లో ఇది అత్యంత భారీగా విడుదల కానుంది.





Tags:    

Similar News