ఎట్ట‌కేల‌కు ప్లే గ్రౌండ్ కి కార‌ణం చెప్పిన న‌టుడు!

తాజాగా రాజేంద్ర‌న్ త‌న గుండు వెనుక గ‌ల సీక్రెట్ ని రివీల్ చేసారు.;

Update: 2025-12-27 19:30 GMT

కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లో నూ ఫేమ‌స్ క‌మెడియ‌న్ మొట్ట రాజేంద్ర‌న్. త‌మిళ అనువాద చిత్రాల‌తో రాజేంద్ర‌న్ కు తెలుగులో నూ మంచి గుర్తింపు ఉంది. రాజేంద్ర‌న్ అంటే గుండు గుర్తొస్తుంది. రాజేంద్ర‌న్ కంటే గుండు న‌టుడిగానే బాగా ఫేమ‌స్ అయ్యారు. ఆ నునుపు గుండె అత‌డికి ఓ ఐడెంటిటీ లాంటింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సాదార‌ణ ఫైట‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ త‌ర్వాత సినిమాల్లో సైడ్ విల‌న్ పాత్ర‌లు పోషిచారు. అక్క‌డ నుంచి మెయిన్ విల‌న్ గా ప్ర‌మోట్ అయ్యారు. ఆ త‌ర్వాత ఏకంగా హీరో రేంజ్ ఇమేజ్ నే సంపాదించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు స్టార్ హీరోలంద‌రి సినిమాల్లోనూ న‌టించారు.

తాజాగా రాజేంద్ర‌న్ త‌న గుండు వెనుక గ‌ల సీక్రెట్ ని రివీల్ చేసారు. ఒక మ‌ల‌యాళ సినిమా షూటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో 15 అడుగుల ఎత్తు నుంచి నీళ్ల‌లోకి దూకాల్సిన సీన్ చేయాల‌ట‌. దీంతో రాజేంద్ర‌న్ షూటింగ్ స్పాట్ కు వెళ్లిన త‌ర్వాత డైరెక్ట‌ర్ చెప్ప‌గానే కింద‌న ఉన్న‌దంతా నీరు అనుకునే అందులోకి దూకేసాడు. కానీ అదంతా నీరు కాదు ఓ ఫ్యాక్టరీ నుంచి వ‌చ్చే క‌మెక‌ల్ వాట‌ర్ అని దూకిన త‌ర్వాత తెలిసింది. ఈ నీళ్ల‌లోకి ఎందుకు దూకార‌ని స్థానికులు చెప్పే వ‌ర‌కూ విషయం తెలియ‌లేద‌న్నాడు. అప్ప‌టి నుంచి జుట్టు రాలడం మొద‌లైందన్నారు. కాల క్ర‌మంలో జుట్టు మొత్తం ఉడిపోయి ప్లే గ్రౌండ్ లా మారిపోయింద‌న్నారు.

క‌ను బొమ్మ‌లు స‌హా రెప్ప‌ల వ‌ద్ద ఉండే వెంట్రుక‌లు కూడా ఉడిపోయాయ‌ని తెలిపాడు. ఇలా ఊడిపోయే స‌ర‌కి తాను కూడా ఎంతో బాధ‌ప‌డిన‌ట్లు తెలిపారు. చుట్టూ ఉన్న వారు షూటింగ్ కి అంద‌మైన హెయిర్ స్టైల్ తో వ‌స్తుంటే? తాను మాత్రం బొడి గుండుతో స్పాట్కి వెళ్ల‌డం న‌చ్చ‌లేదున్నారు. అప్ప‌టి నుంచి విల‌న్ పాత్రలకు బ‌ధులు కామెడీ పాత్ర లు రావ‌డం మొద‌లైంద‌న్నారు. అలా గుండు కావ‌డంతోనే న‌టుడిగా తాను బిజీ అయ్యాన‌ని గుర్తు చేసు కున్నారు. అదే త‌ల ఉంటే అన్ని సినిమాలు చేసేవాడిని కాద‌ని...అదే త‌న‌కు పెద్ద ఐడెంటిటీగా మారింద‌న్నారు.

విగ్ పెట్టుకోవ‌డం కంటే విగ్గు తీసేసి తిరిగితేనే అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌న్నారు. విగ్గు పెట్టుకుంటే త‌న‌ని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌డం లేద‌ని....క్లీన్ షేవ్ తో ఉంటేనే అంద‌రూ గుర్తిస్తున్నార‌న్నారు. తెలుగు ఆడియ‌న్స్ త‌న‌ను థియేట‌ర్ లో స్క్రీన్ పై చూసి ఈల‌లు, కేక‌లు వేస్తే ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఆనందంతో ఎ ంతో ఎమోష‌న‌ల్ కూడా అవుతాన‌న్నారు. రాజేంద్ర‌న్ కొన్ని తెలుగు సినిమాలు కూడా చేసారు. `ఛ‌లో`, ` ఎఫ్3`, `వాల్తేరు వీర‌య్`, `స‌ర్`, `విమానం`, `ఓజీ`, `త్రిబాణధారి బార్బారిక్` లాంటి చిత్రాల్లో న‌టించారు.

Tags:    

Similar News