డ్యాన్స్‌పై జ‌గ్గూ భాయ్ ఒపీనియ‌న్ ఇదా?

సినిమాల్లో క‌థానాయ‌కుడిగా రాణించాలంటే ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌..ఇలా న‌వ‌ర‌సాలు పండించాల్సిందే.;

Update: 2026-02-14 22:30 GMT

సినిమాల్లో క‌థానాయ‌కుడిగా రాణించాలంటే ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌..ఇలా న‌వ‌ర‌సాలు పండించాల్సిందే. మ‌న సినిమాల్లో హీరో అంటే డ్యాన్స్ కంప‌ల్స‌రీ.. మిగ‌తా భాష‌ల గురించి ప‌క్క‌న పెడితే తెలుగులో మాత్రం హీరో డ్యాన్స్ చేయాల్సిందే. ప్రేక్ష‌కులు త‌న స్టెప్పుల‌కు చిందులెయ్యాల్సిందే. ఎన్టీఆర్ నుంచి నేటి త‌రం హీరోల వ‌ర‌కు డ్యాన్స్ వెరీ కామ‌న్‌గా మారిపోయింది. అలాంటి డ్యాన్స్‌పై జ‌గ్గూభాయ్ జ‌గ‌ప‌తిబాబుకు ఓ క్రేజీ ఓపీనియ‌న్ ఉంద‌ట‌. దాన్ని తాజాగా ఆయ‌న బ‌య‌ట‌పెట్టేశాడు.

శోభ‌న్‌బాబు, మంజుల జంట‌గా న‌టించిన `మంచి మ‌నుషులు` సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు జ‌గ‌ప‌తిబాబు. 1989లో రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు క‌థానాయ‌కుడిగా న‌టించిన `సింహ‌స్వ‌ప్నం` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రికార్డ్ ఏంటంటే హీరోగా ప‌రిచ‌య‌మైన తొలి సినిమాలోనే జ‌గ్గూభాయ్‌డ్యుయెల్ రోల్ చేయ‌డం. అదే ఏడాది `అడ‌విలో అభిమ‌న్యుడు`తో సోలో హీరోగా సినిమా చేసి స‌క్సెస్ అందుకున్నారు. అక్క‌డి నుంచి హీరోగా ఆయ‌న ప్ర‌యాణం సాగింది. ఆ త‌రువాత నుంచి హీరో వేషాలు ప‌క్క‌న పెట్టారు.

నంద‌మూరి బాల‌కృష్ణ `లెజెండ్‌`తో విల‌న్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శ్రీ‌కారం చుట్టారు. విల‌న్‌గా, ఫాద‌ర్‌గా ఇలా విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `పెద్ది` మూవీలో అప్ప‌ల‌సూరిగా స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లో ప్రేక్ష‌కుల్ని స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్నారు. క్యారెక్ట‌ర్ మేకోవ‌ర్ జ‌గ్గూ భాయ్‌ని కాకుండా ఓ కొత్త న‌టుడిని గుర్తు చేస్తోంది. అంతలా మేక‌ప్‌తో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఆయ‌న రూపాన్నే మార్చేశారు.

సినిమాలో జ‌గ్గూభాయ్ కాకుండా కేవ‌లం అప్ప‌ల‌సూరి మాత్ర‌మే క‌నిపించాల‌నే ప‌ర్‌ఫెక్ష‌న్‌తో మేక‌ప్‌తో మ్యాజిక్ చేశారు. ఆయ‌న లుక్ చూసిన వాళ్లు జ‌గ్గూభాయేనా అని ఆశ్చ‌ర్య‌పోవ‌డం తెలిసిందే. మూడున్న ద‌శాబ్దాల‌కు పైగా న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేసిన జ‌గ‌ప‌తిబాబు తాజాగా డ్యాన్స్‌పై చెప్పిన ఒపీనియ‌న్ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ డ్యాన్స్ గురించి షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. డ్యాన్స్ నాకు రాదు అది వేరే సంగ‌తి. డ్యాన్స్ అంటే మొద‌టి నుంచి నాకు భ‌యం. ఇష్టం కూడా ఉండేది కాదు.

ఆడియ‌న్స్ అంతా ఎదురుగుండా చూస్తూ ఉంటే తోలుబొమ్మ‌లాట లాగా ఏంటీ డ్యాన్సు అని ఓ ఫీలింగ్ ఫ‌స్ట్ నుంచి నా మైండ్‌లో స్ట్ర‌క్ అయిపోయింది. నా బాడీలో డ్యాన్స్ లేద‌నుకుంటా. నాకు వ‌చ్చింది ఒకే ఒక స్టెప్ అది త‌రువాత చూపిస్తా. నా డ్యాన్స్ గురించి ఫ్రెండ్ అర్జున్‌ని అడిగితే చెబుతాడు. చాలా మంది డ్యాన్స్ మాస్ట‌ర్స్ అనేవారు. నీకు డ్యాన్స్ వ‌చ్చు..చేస్తున్నావ్. ఎక్క‌డో డౌట్ వ‌స్తోంది అక్క‌డే ఆగిపోతున్నావ్ అనేవారు. కొన్ని సినిమాల్లో బాగా డ్యాన్స్ చేశాను. అయితే ఎక్కువ సినిమాల్లో మాత్రం చాలా చండాలంగ చేశాను. డ్యాన్స్ మాస్ట‌ర్స్ అంటే నాకు దెయ్యాలు, భూతాలు.. రాత్రి క‌ల‌లోకి వ‌చ్చేసి రాత్రి నిద్ర పోతుంటే రాని స్టెప్‌ని క‌ల‌లో వ‌చ్చి చెబుతున్న‌ట్టుగా ఉండేది..అలాంటి ఆలోచ‌న‌ల‌తో నిద్ర‌ప‌ట్ట‌ని రోజులు ఎన్నో ఉన్నాయి` అంటూ జ‌గ్గూభాయ్ న‌వ్వులు పూయించారు.

Tags:    

Similar News