హనుమంతు లేకుండానే జై హనుమాన్..?

ఐతే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. జై హనుమాన్ సినిమాలో లార్డ్ హనుమాన్ గా రిషబ్ శెట్టిని తీసుకొస్తున్నారు.;

Update: 2025-12-28 04:51 GMT

తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ హనుమాన్. చిన్న సినిమాగా 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా బాగా నచ్చేసింది. అందుకే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయ్యింది. హనుమాన్ సినిమాలో హనుమంతు రోల్ లో తేజా సజ్జ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే జాంబి రెడ్డితో సక్సెస్ అందుకున్నాడు తేజ. అదే కాంబో ఈసారి హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.

జై హనుమాన్ పట్టాలెక్కాల్సింది కానీ..

ఐతే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. జై హనుమాన్ సినిమాలో లార్డ్ హనుమాన్ గా రిషబ్ శెట్టిని తీసుకొస్తున్నారు. కాంతారా రెండు సినిమాలతో రిషబ్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. అతన్ని తెలుగులో జై హనుమాన్ కోసం తీసుకు రావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇంకాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఐతే అసలైతే జై హనుమాన్ ఈ పాటికే పట్టాలెక్కాల్సింది కానీ అది కుదరలేదు. =

ప్రశాంత్ వర్మ వరుస సినిమాల కమిట్మెంట్ వల్ల ఏది ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐతే రిషబ్ ఇచ్చిన డేట్స్ లో జై హనుమాన్ పూర్తి చేయాలి లేదంటే అతను కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఐతే హనుమాన్ సీక్వెల్ అయిన జై హనుమాన్ లో తేజా సజ్జ ఉంటాడా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. మామూలుగా ఏదైనా సీక్వెల్ చేసేప్పుడు మొదటి పార్ట్ లోని లీడ్ యాక్టర్ నేపథ్యం తీసుకునే సీక్వెల్ ప్లానింగ్ ఉంటుంది.

తేజా సజ్జ మిరాయ్ 2, జాంబి రెడ్డి 2..

అలా చూస్తే హనుమంతుగా చేసిన తేజా సజ్జ కచ్చితంగా జై హనుమాన్ లో ఉండాల్సిందే. ఐతే తేజా సజ్జ రీసెంట్ ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ సినిమాల గురించి చెబుతూ మిరాయ్ 2, జాంబి రెడ్డి 2 చెప్పాడు కానీ జై హనుమాన్ మాట చెప్పలేదు. హనుమాన్ సీక్వెల్ లో తేజా సజ్జ ఉండే ఛాన్స్ లేదా అన్న డౌట్స్ మొదలయ్యాయి. జాంబి రెడ్డి 2కి ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస్తున్నాడు. ఐతే ఒకేసారి అందరి నిర్మాతలతో సినిమాలను కమిటై ప్రశాంత్ వర్మ ఇబ్బందుల్లో పడ్డాడు. ఇవన్నీ దాటుకుని జై హనుమాన్ పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంది.

తేజా సజ్జ మాత్రం జై హనుమాన్ లో ఉంటాడా లేదా అన్న క్లారిటీ ఇవ్వలేదు. ఐతే మిరాయ్ తో హిట్ అందుకున్న తేజా సజ్జ ఆ సినిమా సీక్వెల్ తో పాటు జాంబి రెడ్డి 2 తో ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆ సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారట. మొత్తానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజా సజ్జ ఇప్పుడు హీరోగా కూడా సరైన సినిమాలతోనే కెరీర్ కొనసాగిస్తున్నాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News