• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యువతలో మార్పులు...

యువతలో మార్పులు తీసుకొస్తున్న జై భీమ్ !

By - Tupaki Desk
Update: 2021-11-20 23:30 GMT
ఓ వైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా జై భీం సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటే.. మరో వైపు తమిళనాడులో జై భీం సినిమాపై నెలకొన్న వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది యువత న్యాయవృత్తిని చేపడతామని బాధితులకి న్యాయం చేకూరేలా తమ వంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రవణ్ అనే కామర్స్ విద్యార్థి ఈ సినిమా చూసిన తర్వాత తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

అంతేకాదు తనకు న్యాయ రంగం నచ్చిందని, పైగా ఈ చిత్రంలో సూర్య తీసుకున్న తుది నిర్ణయం తనకు బాధితులకు న్యాయం చేయడానికి ఉపకరించేలా ఉందని అన్నాడు. అయితే శ్రవణ్‌ లైంగిక వేధింపుల బాధితులు తమ తప్పు లేకుండానే వారు శిక్షించబడుతున్నారని వారికి న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంబీఏ చేస్తున్న శ్రవణ్‌ సత్యనారాయణ అనే మరో విద్యార్థి ఈ సినిమా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, సాధికారత కోసం ఏదైనా చేయాలనే సందేశాన్ని ఇస్తోందని అందువల్ల తాను వారికి ఉద్యోగాలు పొందేలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు.

అయితే టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ సినిమా 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో జస్టిస్ కే. చంద్రు పోరాడిన కేసు తాలుకా ఇరులర్ తెగకు చెందిన ఒక జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమాజంలోని అసమానతలు అణగారిన వర్గాల అణచివేతకు సంబంధించిన ఇతి వృత్తాలను స్పృశిస్తూనే, న్యాయవాది శక్తితో మానవ హక్కులను కాపాడేలా వారి బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె. చంద్రు ఈ చిత్రాన్ని "అర్ధవంతమైన సినిమా"గా అభివర్ణించారు. అంతేకాదు దిద్దుబాటు యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒక న్యాయవాది సునిశితమైన న్యాయవ్యవస్థ సాయంతో బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేయడంలో సహాయపడగలరంటూ కె. చంద్రు విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags:    
  • Jai Bhim 
  • Suriya 
  • suriyamovices 
  • OTT 
  • Kollywood star 
  • Tamil Nadu 
  • Director 
  • telugu new movies 
  • movies 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS