• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగపతి సినిమా.. దానికి...

జగపతి సినిమా.. దానికి రీమేకా?

By - Tupaki Desk
Update: 2016-12-05 22:30 GMT
దశాబ్దం కిందట ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘బ్లాక్’ పేరుతో ఓ సినిమా చేశాడు గుర్తుందా? అమితాబ్ బచ్చన్.. రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్లాక్’ గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక క్లాసిక్‌ గా నిలిచిపోయింది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. సీనియర్ నటుడు జగపతిబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.

హీరో నుంచి విలన్ పాత్రలకు మళ్లిన జగపతి.. మళ్లీ కథానాయకుడిగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘పటేల్ సార్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో తాను 60 ఏళ్ల పైబడ్డ వృద్ధుడిగా కనిపిస్తానని జగపతి చెప్పాడు. ఈ సినిమా టీచర్ అయిన ఓ వృద్ధుడికి.. అంధురాలైన ఓ అమ్మాయికి మధ్య నడిచే కథ అని జగపతి తెలిపాడు.

సరిగ్గా ‘బ్లాక్’ సినిమా కథ కూడా ఇలాగే ఉంటుంది. అందులో అమితాబ్ వృద్ధుడైన టీచర్. రాణీ ముఖర్జీ అంధురాలు. వీళ్లిద్దరి మధ్య బంధం నేపథ్యంలో సాగుతుందా సినిమా. మరి ఈ రెండు పాత్రలు యాదృచ్ఛికంగా కలుస్తున్నాయా.. లేక నిజంగానే ‘బ్లాక్’ సినిమాను రీమేక్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఓ కొత్త దర్శకుడు రూపొందించే ఈ సినిమాను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి జగపతి బాబే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభమవుతుందని జగపతి తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jagapathi Babu 
  • Patel Sir Movie 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS