జాక్వెలిన్‌ సందేశాలు కూడా ఇస్తుందా?

Update: 2020-03-08 04:19 GMT
శ్రీలంకన్  బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ కింగ్ ఫిష‌ర్ మోడ‌ల్ గా ప్ర‌పంచానికి సుప‌రిచితం. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ‌ గ్లామరస్ నాయిక‌గా పేరు తెచ్చుకుంది.  అందాలను ఒలకబోసే పాత్రల్లో.. స్పెషల్‌ సాంగ్స్ లో ఆడియెన్స్ ని జాకీ మెస్మ‌రైజ్ చేస్తోంది. ఎప్పుడూ లేటెస్ట్ ట్రెండీ డ్రెస్ లతో.. అర్థ నగ్న దుస్తులతో సోష‌ల్ మీడియా వేదిక‌గా కనువిందు చేసే జాక్వెలిన్‌ ఉన్నట్టుండి గెటప్ మార్చింది.

ఒక‌రకంగా జాకీ  పాత కాలంలోకి వెళ్ళిపోయింది. తాజాగా రెట్రోలుక్ లో ఫోటోలకు పోజులిస్తూ తనలోని కొత్త యాంగిల్ ని బయటపెట్టేసింది ఈ బ్యూటీ. డిఫరెంట్‌ స్టయిల్ లో.. భిన్న భంగిమల్లో పోజులిచ్చింది. వాటిని తన సోషల్‌ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.  ఇప్పుడీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్‌ చేస్తున్నాయి.

ఈ ఫోటోల్లో జాక్వెలిన్‌ పూలరంగు దుస్తులు ధరించి 1970నాటి అమ్మాయిగా కనిపిస్తుంది. అంతేకాదు అందులో తాను చిలిపిగా.. సరదాగా.. కవ్వింపుగా ఉన్న లుక్స్ యూత్ ని ఫిదా చేస్తున్నాయి.  జాక్వెలిన్‌ ఈ కొత్త లుక్ ని చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఉన్నట్టుండి జాకీ ఇలా మారిపోవడానికి కారణమేమిటనేది తెలుసుకునే పనిలో బిజీ అయ్యారు. అందుకు కారణాలు వెతికే క్రమంలో కొన్ని నిజాలను తెలుసుకున్నారు జ‌నం.  వచ్చేది సమ్మర్ కదా. ఉక్కపోతతో బాడీ హీటెక్కిపోతుంది. దీంతో ఆ హీటుని తగ్గించుకునేందుకు ఇలాంటి తేలికైనా దుస్తులు ధరించాలని ఆమె చెబుతోంది. హీటు నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలిపిన జాక్వెలిన్‌ కి పలువురు నెటిజన్లు కితాబిస్తున్నారు.

2019లో ప్రభాస్‌ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'సాహో'లో 'బ్యాడ్‌ బాయ్‌' పాటలో తనదైన అందాల ప్రదర్శనతో హీటు పుట్టించిన జాక్వెలిన్‌ ప్రస్తుతం 'ఎటాక్‌' అనే చిత్రంలో జాన్‌ అబ్రహంతో కలిసి నటిస్తుంది. యాక్షన్‌ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరో కథానాయికగా నటిస్తోంది. జాకీ మ‌రోసారి మంట‌లు పుట్టించడం ఖాయ‌మ‌న్న అంచ‌నా యూత్ లో ఉంది.




Tags:    

Similar News