ఎంత కవర్ చేసినా కూడా ఈజీగా తెలిసి పోతుంది
బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ నటించిన 'బిగ్ బుల్' విడుదలకు సిద్దంగా ఉంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా ను రెడీ అయినా కూడా గతంలో వచ్చిన ఒక వెబ్ సిరీస్ కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. బిగ్ బుల్ సినిమా అనేది హర్షద్ మెహత కథ ఆధారంగా రూపొందింది. షేర్ మార్కెట్ భారీ స్కామ్ నేపథ్యంలో హర్షద్ మెహత కథాంశంతో రూపొందిన బిగ్ బుల్ సినిమా తరహాలోనే గతంలో స్కామ్ 1992 పేరుతో వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ కూడా హర్షద్ మెహత స్కామ్ నేపథ్యంలోనే కొనసాగుతుంది. ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్కామ్ 1992 ను ఇప్పటికి ఓటీటీలో చూస్తూనే ఉన్నారు. అదే కథతో రాబోతున్న బిగ్ బుల్ పై పెద్దగా జనాల్లో ఆసక్తి కనిపించడం లేదు.
స్కామ్ 1992 వెబ్ సిరీస్ సందడి తగ్గిన తర్వాత బిగ్ బుల్ ను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో వాయిదాలు వేస్తూ వచ్చారు. ఇటీవలే హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కు డేట్ ను అనౌన్స్ చేశారు. వచ్చే నెల 8వ తారీకున స్ట్రీమింగ్ కు సిద్దం అవుతున్న బిగ్ బుల్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో ఈ సినిమా కు స్కామ్ 1992 వెబ్ సిరీస్ కు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా కవరింగ్ చేసేందుకు తీవ్రంగా అయితే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా వెబ్ సిరీస్ తో పోల్చుతూ సన్నివేశాలను వివరిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ మీమ్స్ వస్తున్నాయి.
బిగ్ బుల్ సినిమాలో జూనియర్ బచ్చన్ మంచి నటనను కనబర్చినట్లుగా ట్రైలర్ ను చూస్తుంటే అనిపిస్తుంది. కాని ఆయనకు ఇది ఎంత వరకు సక్సెస్ ను ఇస్తుంది అనేది మాత్రం నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటికి స్కామ్ 1992 వెబ్ సిరీస్ ట్రెండ్డింగ్ లోనే ఉంది. కనుక అదే కథతో వస్తున్న బిగ్ బుల్ ను ఎవరు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు అనేది అనుమానమే.