బాహుబలి టిక్కెట్లు ఇప్పటికీ దొరకలేదు
బాహుబలి రిలీజై నెలరోజులు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఊపు తగ్గలేదు. థియేటర్లు కిటకిటలాడుతూనే ఉన్నాయి. టిక్కెట్లు దొరక్క జనాలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సందర్భం చాలా అరుదు. ఓ బాలీవుడ్ సినిమాకి సాధ్యపడని అసాధారణ ఫీట్ ఇది. సల్మాన్ - అక్షయ్ - షారూక్ - అమీర్‌ఖాన్ .. ఇలాంటి స్టార్లెవరూ లేనే లేరు. అయినా ఇప్పటికీ కలెక్షన్లే కలెక్షన్లు. ముందుగా ఆన్ లైన్ లో టిక్కెట్టు బుక్ చేసుకుని వెళ్లకపోయారే అంతే సంగతి. అసలిదంతా ఎవరు చెప్పారనుకుంటున్నారు? బాలీవుడ్ లో ఫేమస్ పోర్టర్ గ్లామ్ షామ్ ఎడిటోరియల్ రాసిన ఎడిటర్ చెప్పారు.
ఒక తెలుగు సినిమా గురించి ఇంటర్నేషనల్ పత్రికల్లో ఓ ఎడిటోరియల్ రాశారంటే ఇది నిజంగానే తెలుగు గడ్డ గర్వించదగ్గ విషయం. ఓ లేజీ డే.. ఫ్యామిలీ అంతా బాహుబలి చూడాలనుకున్నాం. ఏముందిలే ఇప్పటికే నెలరోజులైంది. టిక్కెట్లు ఈజీగానే థియేటర్ దగ్గరే దొరికేస్తాయ్ అనుకుని వెళ్లాం. తీరా థియేటర్ కి వెళితే హౌస్ ఫుల్ బోర్డ్. ఆ రాత్రివేళ ఒక థియేటర్ నుంచి ఇంకో థియేటర్ కి పిల్లల్ని వేసుకుని మరీ పరిగెత్తాల్సి వచ్చింది. అనుకున్న ఆటకు వెళ్లలేకపోయాం. అంతేనా ఆ తర్వాత సెకండ్ షోకి టిక్కెట్లు బుక్ చేసుకున్నాం అంటూ రాసుకొచ్చారు.
2000 సంవత్సరంలో ఇలా ఆడేవి బాలీవుడ్ సినిమాలు. నెలరోజుల తర్వాత కూడా టిక్కెట్లు దొరకని వైనం అప్పట్లో ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా వారం రోజులే. కానీ బాహుబలి చరిత్రను తిరగరాసింది. ఇదంతా రాజమౌళి క్రెడిట్. అతడు అసాధారణ దర్శకుడు. గొప్ప టెక్నీషియన్. 2016లో రానున్న బాహుబలి- 2 గురించి ఎంతో క్యూరియస్ గా ఉన్నాం.. అంటూ సదరు ఎడిటోరియల్ బాహుబలిని ఆకాశానికెత్తేసింది. దటీజ్ అవర్ సినిమా. హ్యాట్సాఫ్ టు రాజమౌళి.