నభా ఆశలు గల్లంతేనా?
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న నభా నటేష్ ఆ వెంటనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాను చేసింది. ఆ సినిమా సమ్మర్ లో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే నభాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే నభా మాత్రం ఇంకా మంచి పాత్ర కోసం వెయిట్ చేసింది. అలాగే పారితోషికం విషయంలో కూడా ఆమె ఎక్కువగా ఆశించింది. దాంతో వచ్చని ఆ ఆఫర్లు వెనక్కు పోయాయి. సోలో బ్రతుకే సోబెటర్ సినిమా విడుదలై సక్సెస్ అయితే లేదంటే కనీసం యావరేజ్ గా నిలిచినా కూడా తన పారితోషికం విషయంలో భారీ మార్పు వస్తుందని ఆశించింది. అప్పుడు సినిమాలు కమిట్ అవ్వాలని ఆశించింది.
ఇప్పుడు సోలో బ్రతుకే సోబెటర్ సినిమా థియేటర్ విడుదలకు అవకాశం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఓటీటీలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఒక వేళ అదే కనుక నిజం అయితే నభా నటేష్ ఆశలు గల్లంతు అయినట్లే అంటున్నారు. సినిమా ఫలితం ఎంత పాజిటివ్ గా వచ్చనా కూడా ఆమెకు ఆఫర్లు ఏ మేరకు వస్తాయో అనేది చెప్పలేని పరిస్థితి.
సరే ఆఫర్లు వచ్చాయే అనుకున్నా ఆమె ఆశించిన పారితోషికం అయితే ఈ సమయంలో రాదు అని ఖచ్చితంగా చెప్పగలం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు వచ్చన ఆ మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్య ఉంటే ఆమె ఆర్థికంగా లాభపడేది అనేది కొందరు వాదన. మరి ఈ విషయంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.