ఈ కుర్రహీరోయిన్ తమిళ దర్శకుడితో 'డేటింగ్' చేస్తోందా..??

Update: 2021-02-20 02:30 GMT
2016లో విడుదలైన మజ్ను మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కన్నడ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు మజ్ను మూవీతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్వప్నసంచారి మూవీతో కెరీర్ ప్రారంభించి 'యాక్షన్ హీరో బిజు' సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదట్లో పక్కింటి అమ్మాయిలా క్యూటుగా తెలుగు యూత్ మనసు దోచేసుకుంది. 19ఏళ్లకే హీరోయిన్ అయిన అను అందమైన కళ్లతో.. కొంటె చూపులతో అభిమానులలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే మజ్ను తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజరెడ్డి అల్లుడు ఇలా వరుసగా సినిమాలు చేసింది కానీ నిరాశపరుస్తూ వచ్చాయి. 'నమ్మ వీట్టు పిళ్ళై' సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. ప్రస్తుతం అను చేతిలో 18పేజెస్, మహాసముద్రం సినిమాలు ఉన్నాయట. అయితే తాజాగా అమ్మడు రిలేషన్ షిప్ లో ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. సినీవర్గాల సమాచారం ప్రకారం.. అను ప్రస్తుతం తమిళ డైరెక్టర్ ఎఎం జ్యోతికృష్ణతో డేటింగ్ లో ఉందట. వీరిద్దరూ కలిసి 2017 చిత్రం ఆక్సిజన్ మూవీకోసం పనిచేశారు. అయితే అప్పటినుండి వీరిద్దరి స్నేహం పెరుగుతూ వచ్చిందని మొత్తానికి ఈ జంట రిలేషన్ షిప్ లో అడుగేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పుకార్లు వెలువడుతున్నాయి. జ్యోతికృష్ణ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత ఎఎం రత్నంకు పెద్దకొడుకు. అయితే ఈ పుకార్లపై అను ఇంకా స్పందించలేదు. చూడాలి మరి వీరిద్దరూ ఎలా స్పందిస్తారో!


Tags:    

Similar News