ర‌ష్మిక‌ను వెంటాడుతున్న షాడో మ్యాన్!

Update: 2020-02-29 06:00 GMT
ర‌క్షిత్-ర‌ష్మిక మంద‌న ల ల‌వ్ బ్రేక‌ప్ వ్య‌వ‌హారం తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమ‌లో మ‌ధురానుభూతులు అస్వాధించిన ఈ జంట నిశ్చితార్ధం అనంత‌రం అనూహ్యంగా మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో విడిపోయారు. అటుపై కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు. ప్రస్తుతం ఎవ‌రి జ‌ర్నీ వాళ్ల‌ది. ర‌క్షిత్ క‌న్న‌డ‌లో సినిమాలు చేసుకుంటుంటే.. ర‌ష్మిక టాలీవుడ్ ని ఏల్తోంది. అయితే బ్రేక‌ప్ త‌ర్వాత ర‌ష్మిక ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కొందో తెలిసిందే. త‌ప్పంతా ర‌ష్మిక‌దే అంటూ ర‌క్షిత్ ఫ్యాన్స్ నానా ర‌చ్చ చేసారు. ర‌ష్మిక‌కు మాన‌సిక ఆనందాన్ని దూరం చేసి సూటి పోటి మాట‌ల‌తో గుచ్చేశారు.

ర‌క్షిత్ వారించాల‌ని ప్ర‌య‌త్నించినా విన‌కుండా రష్మిక‌ని ప‌దే ప‌దే ప‌నిగ‌ట్టుకుని మ‌రీ విమ‌ర్శించారు. ఇప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు ర‌ష్మిక‌కు ర‌క్షిత్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. మ‌రి ఇలాంటి ఫేజ్ లో మ‌ళ్లీ మాజీ ప్రేమికులు క‌ల‌సి ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌నున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. కిర్రాక్ పార్టీ సినిమాలో ఇద్ద‌రు జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాతోనే ర‌ష్మిక హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది. తాజాగా ఈ సినిమా కు ర‌క్షిత్ సీక్వెల్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట‌.

స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సీక్వెల్ ని నిర్మించాల‌ని.. సేమ్ టీమ్ తోనే యాథావిథిగా ముందుకెళ్లాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ర‌ష్మిక‌నే మ‌రోసారి త‌న స‌ర‌స‌న న‌టింప‌జేయాల‌ని చూస్తున్నాడు. మ‌రి ఇది జ‌రుగుతుందో లేదో? తెలియదు గానీ తాజా క‌థ‌నాల‌ను బ‌ట్టి హీరోగారు ఇంకా ర‌ష్మిక‌ను పూర్తిగా మ‌ర్చిపోయిన‌ట్లు లేదు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. గ‌తేడాది వ‌ర‌కూ ఎప్పుడూ టాలీవుడ్ వైపు చూడ‌ని ర‌క్షిత్ త‌ను న‌టించిన ఓ సినిమాని శ్రీమ‌న్నార‌య‌ణ టైటిల్ తో అనువ‌దించి రిలీజ్ చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ టైమ్ లో మంచి క‌థ కుదిరితే తెలుగులో నేరుగా ఎంట్రీ ఇస్తాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చాడు. తాజాగా ర‌ష్మిక‌ను జోడీగా పెట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ కిర్రిక్ పార్టీకి సీక్వెల్ చేయ‌డం వెనుక ప్లాన్ ఏంటో? అంటూ ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ర‌ష్మిక‌ను ఒక షాడోలా ర‌క్షిత్ వెంటాడుతున్నాడా? అంటూ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News