'ఆర్.ఆర్.ఆర్' లో అలియా ప్లేస్ లో యాక్ట్ చేసే బ్యూటీ...?
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్ర చేస్తుంటే.. ఎన్టీఆర్ 'కొమరం భీమ్' పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే.. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు అలియా ని 'ఆర్.ఆర్.ఆర్' ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా అలియా భట్ 'గంగూబాయ్' 'బ్రహ్మస్త్ర' సినిమాల్లో నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో అమ్మడుకి డేట్స్ క్లాష్ వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే 'ఆర్.ఆర్.ఆర్' మోషన్ పోస్టర్ మరియు చరణ్ ఇంట్రో వీడియో ద్వారా అలియా నే ఈ సినిమాలో హీరోయిన్ అని మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి నెపోటిజం యాక్టర్స్ కారణమని.. ముఖ్యంగా అలియా తండ్రి మహేష్ భట్ పాత్ర ఉందని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజైన అలియా భట్ 'సడక్ 2' ట్రైలర్ ని ప్రపంచంలోనే అత్యధికమంది డిస్ లైక్స్ కొట్టిన లిస్ట్ లో జాయిన్ అయ్యేలా చేశారు. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అలియా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఫై కూడా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి అలియా వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన మేకర్స్ ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఎవరైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేదా గ్లోబల్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే చరణ్ కి జోడీగా ఆల్రెడీ 'తుఫాన్' లో నటించిన ప్రియాంక చోప్రా ని 'ఆర్.ఆర్.ఆర్' కోసం తీసుకున్నారని న్యూస్ వచ్చింది. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
వాస్తవానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని ఈ రోల్ కోసం సంప్రదించారట. అయితే ఇంకా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ఒకవేళ వీరెవరూ కుదరకపోతే బాలీవుడ్ లో కూడా పాపులారిటీ తెచ్చుకున్న సౌత్ హీరోయిన్ తీసుకుందామనేది డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ స్టార్ట్ అయితే మరో ఆరు నెలల సమయం పడుతుందని జక్కన్న క్లారిటీ ఇచ్చేసాడు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా 'ఆర్.ఆర్.ఆర్' విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.