• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా మేనల్లుడికి నాగ్...

మెగా మేనల్లుడికి నాగ్ అన్ని కోట్లు ఇస్తున్నాడా..?

By - Tupaki Desk
Update: 2021-07-05 06:34 GMT
మెగా మేనల్లుడు, సాయి తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాలతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. డెబ్యూ హీరోగా ఎన్నో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఫస్ట్ సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయిన వైష్ణవ్ తో సినిమాలు చేయడానికి పెద్ద నిర్మాణ సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేసిన వైష్ణవ్.. 'కింగ్' అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ మూవీ చేయనున్నాడు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నట్లు నాగార్జున ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే దీని కోసం మెగా మేనల్లుడికి మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారని.. అది రూ.4 - రూ.4.5 కోట్ల మధ్య ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇతర హీరోలతో చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు చేసే నాగ్.. అంత పారితోషికం ఇస్తున్నారనే దాంట్లో నిజమెంతో చూడాలి. ఇకపోతే డెబ్యూ డైరెక్టర్ పృథ్వీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని సమాచారం. ఇదొక హాకీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే స్పోర్డ్స్ డ్రామా అని.. వైష్ణవ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా వైష్ణవ్ తేజ్ రెండో చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పూర్తి చేశాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అలానే గిరీశయ్య దర్శకత్వంలో మెగా హీరో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కేతిక శర్మ ఇందులో వైష్ణవ్‌ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Tags:    
  • Nagarjuna 
  • Uppena Hero 
  • Panja Vaisshnav Tej 
  • remuneration 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS