• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముంబయి భామలపై ఇంద్రజ...

ముంబయి భామలపై ఇంద్రజ కామెంట్

By - Tupaki Desk
Update: 2017-01-28 09:24 GMT
ముంబయి భామలకు సౌత్ ఇండియన్ సినిమాల్లో ఉన్న క్రేజేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి సినిమాల్లోనూ వాళ్లదే ఆధిపత్యం. ఐతే వాళ్ల వల్లే సౌత్ హీరోయిన్లకు అవకాశాలు రావట్లేదంటే తాను అంగీకరించను అంటోంది సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. గ్లామర్ పరంగా ముంబయి వాళ్లు పైచేయి సాధించినా.. నటన విషయంలో దక్షిణాది హీరోయిన్ల ముందు వాళ్లు నిలవలేరు అంటోంది ఇంద్రజ.

‘‘ఉత్తరాది వాళ్లే స్టార్లు అనుకోకూడదు. దక్షిణాది హీరోయిన్లలోనూ స్టార్‌ హీరోయిన్లు అని అనిపించుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ముంబయి హీరోయిన్లలో గ్లామర్ పాళ్లు ఎక్కువ. ఈ విషయంలో దక్షిణాది హీరోయిన్లు పోటీ పడలేకపోతున్నారని నా అభిప్రాయం. ఐతే నటన విషయంలో మాత్రం మనవాళ్లు ఏమాత్రం తక్కువ కాదు. ఒకరకంగా ఆ విషయంలో మనదే పైచేయి. అందాల ఆరబోస్తేనే గుర్తింపు వస్తుంది అనుకోకూడదు. సౌందర్య లాంటి హీరోయిన్లు తమ నటనతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలెంటుని ఆపడం ఎవరి తరం కాదు’’ అని ఇంద్రజ చెప్పింది.

తాను హీరోయిన్‌ గా ఉన్న రోజుల కంటే ఇప్పుడు సినిమా షూటింగుల్లో వాతావరణం బాగుంటోందని ఇంద్రజ వ్యాఖ్యానించింది. అప్పట్లో సెట్లో నటిస్తుంటూ చుట్టూ పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేవని.. కానీ ఇప్పుడు సెట్లో అంతా ప్రశాంతంగా ఉంటోందని.. ఏకాగ్రతతో పని చేయడం వల్ల ఔట్‌ పుట్‌ కూడా బాగా వస్తోందని పేర్కొంది. ఒకప్పుడు తాను కొన్ని సినిమాలు ఒప్పుకుని చేయకపోవడంపై స్పందిస్తూ.. ‘‘అవగాహనారాహిత్యంతోనే కొన్ని తప్పులు జరిగాయి. కొన్నిసార్లు నాకు చెప్పిన కథ వేరు. తీస్తున్నది వేరుగా ఉండేది. అందుకే వాళ్లిచ్చిన డబ్బు వెనక్కిచ్చేసి ఓ నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. మా మేనేజర్‌ కారణంగానూ కొన్ని తప్పులు జరిగాయి. అలా ఏడెనిమిది సినిమాలు ఒప్పుకుని.. తర్వాత తప్పుకున్నాను’’ అని ఇంద్రజ తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Indraja 
  • Mumbai Heroines 
  • TElugu NEWs 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS