ఇది పవన్ ...‘హలో బ్రదర్’

Update: 2021-04-18 14:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. అతి త్వరలోనే ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ను షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు క్రిష్ , హరీష్ శంకర్ సినిమాలు కమిట్ అయ్యాయి ఉన్నాడు పవన్. ఈ సినిమాల్లో హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో హరీష్ శంకర్ సినిమాలో పవన్ ఎలా కనపడబోతున్నాడు,క్యారక్టరైజేషన్ ఏమిటి అనే విషయాలపై అంతటా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పవన్ అభిమానులు ఈ సినిమా అప్ డేట్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా హరీష్ శంకర్ పవన్ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ రూమర్ లాంటి వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. హరీష్ శంకర్ గతంలో పవన్ ను‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూపించారు. ఇప్పుడు ఐబీ ఆఫీసర్ గా చూపించనున్నాడని టాక్. ఇప్పటికే ఇందుకు సంబందించిన కథను కూడా సిద్ధం చేసాడట హరీష్. ఈ స్క్రిప్టులో మరో విశేషం కూడా ఉందని సమాచారం. ఇందులో డబుల్ రోల్లో నటించనున్నాడు.

గతంలో పవన్ కల్యాణ్ తీన్మార్ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. అయితే అందులో ఒకేసారి రెండు పాత్రలు కనిపించవు. కానీ హరీష్ శంకర్ తాజా చిత్రంలో మాత్రం పవన్ ఒకేసారి రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ రెండిట్లో ఒకరు తండ్రిలాగా.. మరొకరు కొడుకులాగా నటిస్తారట. ఫన్ తో కూడిన యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. అంటే హలో బ్రదర్ లాంటి ఐడియా అన్నమాట. ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే అసలుసిసలు మాస్ మాసాలాను ఈ సినిమాతో చూపించబోతున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమాలో కొద్దిగా దేశ భక్తి కూడా ఉండబోతుందిట.




Tags:    

Similar News