నేను కేవలం నటిని మాత్రమే కాదు.. అందుకే గ్యాప్‌

Update: 2020-11-23 09:30 GMT
టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. కోలీవుడ్‌ ఇలా అన్ని చోట్ల సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్‌. ఈమె తెలుగులో నటించిన పలు సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వడం వల్ల ఎప్పుడు ఈమెకు స్టార్స్ సరసన నటించే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో తమిళం మరియు హిందీలో కూడా ఈమెకు ఆఫర్లు వచ్చాయి. కాని ఈమె మాత్రం కెరీర్‌ లో గ్యాప్‌ లు తీసుకుంటూ ఉంది. రెండేళ్ల క్రితం సినిమాలకు దూరం అయిన శృతి హాసన్‌ గత ఏడాది మళ్లీ సినిమాల్లో నటించేందుకు వచ్చింది.

వరుసగా సినిమాల్లో నటించకుండా ఎందుకు గ్యాప్‌ తీసుకుంటున్నారు అంటూ తాజాగా ఒక చిట్‌ చాట్‌ల ఓ శృతి హాసన్‌ కు ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు తనదైన శైలిలో సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పింది. నేను కేవలం హీరోయిన్‌ ను మాత్రమే కాదు. మోడల్‌.. సింగర్‌.. పెయింటింగ్‌.. రచన ఇలా అనేక విభాగాల్లో నాకు ప్రావిణ్యం ఉంది. నాలో ఉన్న ప్రతిభలు అన్నింటికి కూడా నేను న్యాయం చేసుకునేందుకు అన్నింటిని కంటిన్యూ చేస్తున్నాను. ఆ క్రమంలో నటనకు కొన్ని సార్లు గ్యాప్‌ వస్తుంది అంటూ శృతి హాసన్‌ పేర్కొంది. ఈమె త్వరలో రవితేజ తో నటించిన 'క్రాక్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Tags:    

Similar News