ప్రకాష్ రాజ్ ఇవన్నీ అక్కడ చేసుంటే..
సౌత్ ఇండియా అంతటా తిరుగులేని పాపులారిటీ ఉన్న నటుడు ప్రకాష్ రాజ్. ఆ మాటకొస్తే ఉత్తరాదిన కూడా ఆయనకు మంచి పేరే ఉంది. 'వాంటెడ్' సహా చాలా హిందీ సినిమాల్లో నటించారాయన. స్వతహాగా కన్నడిగుడు కావడంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు సొంత గడ్డనే ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో బెంగళూరులోని ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. కొత్త తరహా రాజకీయం చేస్తానంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు మరీ అంతటి పరాభవం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. ఐతే ఈ కాలానికి తగ్గట్లు గిమ్మిక్కులు చేయకపోవడమే ప్రకాష్ రాజ్ పరాజయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కొత్త తరహా రాజకీయం అంటూ ఆదర్శాలు వల్లిస్తూ కూర్చుంటే సరిపోదని.. జనాలను ఆకర్షించడానికి కొన్ని గిమ్మిక్కులు చేయాలని.. ప్రకాష్ రాజ్ ఆ విషయంలో విఫలమయ్యాడని అన్నారు.
కట్ చేస్తే కొన్ని నెలల కిందటే ప్రకాష్ రాజ్ ఎవ్వరూ ఊహించని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రేసులోకి వచ్చాడు. ప్రకాష్ రాజ్ స్థాయికి తనది కాని, ఒక ప్రాంతీయ భాషలో 800 మంది సభ్యులున్న 'మా'లో అధ్యక్ష పదవి చాలా చిన్నది అన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. ఈ పదవి కోసం ఆయన మొదట్నుంచి ఉత్సాహం చూపిస్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతోంది. మామూలుగా తన దారి తనదే అన్నట్లు సాగిపోయే ప్రకాష్ రాజ్.. 'మా' ఎన్నికల కోసమని ఎప్పుడూ చేయని పనులన్నీ చేస్తున్నాడు. చిన్న స్థాయి సినిమాల వేడుకలకు వస్తున్నాడు. 'మా'లో తన ప్యానెల్‌తో కలిసి ఇండిపెండెన్స్ డే సహా కొన్ని సందర్భాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
మొన్న చిరంజీవి పుట్టిన రోజుకు స్వయంగా ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్నాడు. ఇప్పుడేమో నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్లు తన చేతుల మీదుగా జరిపిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియా ద్వారా సినిమా వాళ్లను మచ్చిక చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కొత్తగా ఇవన్నీ చేస్తున్నది ఎన్నికల కోసమే అన్నది స్పష్టం. ఐతే ఇవన్నీ చూసిన వాళ్లు ఇంత చిన్న ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ ఇంత శ్రద్ధ పెడుతుండటం పట్ల ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి గిమ్మిక్కులు ఆయన ఎంపీగా పోటీ చేసినపుడే చేసి ఉంటే ఎన్నికల్లో మంచి ఫలితాన్ని పొందేవాడని అంటున్నారు. 'మా' ఎన్నికల అనుభవాన్ని రేప్పొద్దున సాధారణ ఎన్నికల్లోనూ చూపిస్తే ఆయన రాజకీయాల్లోనూ రాణించే అవకాశాలున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.