అనీల్ ఖాతాలో పెద్దాయన కూడా పడిపోయాడే!
టాలీవుడ్ అంతా ఇప్పుడు అనీల్ రావిపూడి జపమే చేస్తోంది అందరినోట అనీల్ పేరు తప్ప మరోకరి పేరు వినిపించడం లేదు.;
టాలీవుడ్ అంతా ఇప్పుడు అనీల్ రావిపూడి జపమే చేస్తోంది అందరినోట అనీల్ పేరు తప్ప మరోకరి పేరు వినిపించడం లేదు. స్టార్ హీరోలంతా అనీల్ ని స్మరించకుండా ఉండలేకపోతున్నారు. చివరికి మెగాస్టార్ చిరంజీవి కూడా నోరు తెరిచి మరో సినిమా చేయవయ్యా? అంటూ అడిగేస్తున్నారంటే ఎంతగా అలవాటు అయిపోయారో చెప్పొచ్చు. కేవలం ట్యాలెంట్ ఉన్నోళ్ల విషయంలోనే ఇలా జరుగుతుంది. నాలుగు కబుర్లాడి మ్యానేజ్ చేయడం అన్నది తాత్కాలికం మాత్రమే. ట్యాలెంట్ కు ఉన్న ప్రాధాన్యత మరే దానికి ఉండదన్నది అనీల్ విషయంలో మరోసారి ప్రూవ్ అయింది.
ఇప్పటికే అనీల్ ను మరో రాజమౌళిగా కీర్తిస్తున్నారు.రాజమౌళి తరహాలో అనీల్ కు ఇంత వరకూ ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. రాజమౌళి సైతం అనీల్ ను చూసి జెలసీ ఫీలయ్యాడు. ఓ సందర్భంలో అనీల్ ను ముసుగేసి కొడితే? పదివేలు ఇస్తానంటూ చరదాగా చమత్కరించిన వైనం గుర్తుండే ఉంటుంది. అలా అనీల్ రాజమౌళికి బాగా అలవాటైన మనిషిగా మారిపోయాడు. ఇక సినిమాలు తీయడంలో పూరి జగన్నాధ్ స్పీడ్ ని సైతం మించిపోయాడు అనీల్. తక్కువ బడ్జెట్ లోనే బెస్ట్ ఔట్ పుట్ తో వందల కోట్లు వసూళ్లు ఇచ్చే సినిమా అనీల్ కే సాధ్యమైందని నిరూపించాడు.
అనీల్ సినిమాల విషయంలో పంపిణీదారులెంతో సంతోషంగా ఉన్నారు. అనీల్ సినిమా కొన్న ప్రతీ పంపిణీ దారుడు మంచి లాభాలు చూస్తున్నారు. దీంతో వారంతా పట్టరాని అనందంతో ఉన్నారు. ఒకప్పుడు పూరి సినిమాల విషయంలో ఇంత సంతోషంగా ఉండేవారు. ఇప్పుడా స్థానంలోకి అనీల్ వచ్చేసాడు. తాజాగా అనీల్ రావిపూడిని ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతోనే పొల్చేసారు మెగాస్టార్ చిరంజీవి. నిన్నటి రోజున జరిగిన సక్సెస్ మీట్ లో రాఘవేంద్రరావు సినిమా సెట్స్ లో ఎంత సరదాగా ఉంటుందో? అనీల్ రావిపూడి సెట్స్ లో కూడా అంతే సరదాగా ఉంటుందన్నారు.
అనీల్ తో సినిమా అంటే ఓ ఎమోషన్ అంటూ చిరంజీవి ఎంతగా కనెక్ట్ అయ్యారో చెప్పకనే చెప్పారు. షూటింగ్ మొదలైన నాటి నుంచి ముగింపు వరకూ ఒకే ఉత్సాహంతో టీమ్ అంతా పనిచేసామంటే కారకుడు అనీల్ గా పేర్కొన్నారు. స్టోరీ నేరేషన్ సమయంలోనూ చిరంజీవి అంతే సంతోషంగా కనిపించారు. అనీల్ కొన్ని సీన్లు చెబుతున్నప్పుడు? పడి పడి నవ్వినట్లు గతంలో చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇంత యాక్టివ్ గా చిరంజీవి ఈ మూడేళ్ల కాలంలో ఏ సినిమా విషయంలో కనిపించలేదు. ఇదే సక్సెస్ ను కంటున్యూ చేసేలా? బాబితో అన్నయ్య తర్వాత సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.