'ఓ.. సుకుమారి'లో తిరువీర్ మాస్ హవా

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ తిరువీర్ ఇప్పుడు ఒక పక్కా విలేజ్ డ్రామాతో రాబోతున్నారు.;

Update: 2026-01-26 09:40 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ తిరువీర్ ఇప్పుడు ఒక పక్కా విలేజ్ డ్రామాతో రాబోతున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే తిరువీర్, టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్‌తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు 'ఓ.. సుకుమారి' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



 


ఈ సినిమా నుండి లేటెస్ట్ గా తిరువీర్ ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఇందులో తిరువీర్ యాదగిరి అనే ఒక ఊరమాస్ పల్లెటూరి కుర్రాడిగా కనిపిస్తున్నారు. లుంగీ కట్టి, భుజాన తువ్వాలు వేసుకుని, నోట్లో బ్రష్‌తో నడుచుకుంటూ వస్తున్న తిరువీర్ లుక్ చాలా రా అండ్ రస్టిక్ గా ఉంది. గత సినిమాల్లో కనిపించిన గెటప్స్ కంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. తన బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ చూస్తుంటే పక్కా విలేజ్ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. తిరువీర్ తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఈ పాత్రలో జీవించేలా కనిపిస్తున్నాడు.

గతంలో ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్‌ను 'దామిని'గా పరిచయం చేసిన మేకర్స్, ఇప్పుడు తిరువీర్ లుక్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. ఒక పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ రోమ్-కామ్ మూవీలో తిరువీర్, ఐశ్వర్య మధ్య వచ్చే సీన్స్ చాలా నేచురల్ గా ఉంటాయని టీమ్ చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. 'పొలిమేర', 'రజాకార్' వంటి సినిమాలతో మెప్పించిన కుషేందర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచీరాజు మ్యూజిక్ అందిస్తుండగా, 'బలగం' ఫేమ్ తిరుమల తిరుపతి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. 'క' సినిమా ఎడిటర్ శ్రీ వరప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నేటి జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడూ ఇలాంటి రియలిస్టిక్ పల్లెటూరి కథలను ఆదరిస్తున్నారు. తిరువీర్ లాంటి టాలెంటెడ్ నటుడు యాదగిరిగా మారి ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పక్కా లోకల్ ఫ్లేవర్ తో వస్తున్న ఈ సినిమా తిరువీర్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచేలా ఉంది. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుండి గతంలో వచ్చిన 'శివమ్ భజే' సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి, ఇప్పుడు ఈ సినిమాతో వారు మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. 'ఓ.. సుకుమారి' ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తిరువీర్ మాస్ లుక్ నేటి యువతను ఆకట్టుకునేలా ఉంది. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News