ధురంధర్ నటుడు అరెస్ట్.. పదేళ్లుగా నరకం చూపిస్తూ.. ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
నదీమ్ తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోవటంతో బాధితురాలు తమను ఆశ్రయించిందని పోలీసులు పోలీసులు తెలిపారు.;
సినిమా తెరపై నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే కొంతమంది వ్యక్తుల వెనుక ఎంతటి క్రూరత్వం దాగి ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇక ఇటీవల వచ్చిన'ధురంధర్' సినిమా తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నదీమ్ ఖాన్ అసలు స్వరూపం బయటపడింది. తన ఇంట్లోనే పని చేసే మహిళపై దశాబ్ద కాలంగా అతడు సాగిస్తున్న అరాచకం వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నదీమ్ తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోవటంతో బాధితురాలు తమను ఆశ్రయించిందని పోలీసులు పోలీసులు తెలిపారు.
పదేళ్ల మౌనం.. పెళ్లి పేరుతో మోసం:
ముంబై పోలీసుల కథనం ప్రకారం, నదీమ్ ఖాన్ తన ఇంట్లో పని మనిషిగా ఉన్న మహిళను గత పదేళ్లుగా లైంగికంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నారట. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, బయటకు చెబితే పరువు పోతుందని భయపెట్టడమే కాకుండా, నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను మోసం చేసి, నోరు నొక్కేసినట్లు సమాచారం. ఇన్ని ఏళ్లు నరకం అనుభవించిన బాధితురాలు వెర్సోవా చివరకు తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
వెండితెర వేషం.. నిజజీవితంలో విలనిజం:
నదీమ్ ఖాన్ సినీ నేపథ్యం చూస్తే, అతడు బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రంలో అక్షయ్ ఖన్నా వంటమనిషి 'అఖ్లాక్' పాత్రలో నటించాడు. అలాగే కృతి సనన్ నటించిన 'మిమి', 'వాధ్', 'మై లడేగా' వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించాడు. తెరపై సామాన్యంగా కనిపించే ఈ నటుడు, తన సొంత ఇంట్లోనే ఒక పనిమనిషి పట్ల ఇంతటి అమానుషంగా ప్రవర్తించడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.
ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?:
నదీమ్ ఖాన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక నిలకడైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం చిన్న పాత్రలకే పరిమితం కాకుండా, ప్రముఖ నటీనటుల సినిమాల్లో కీలకమైన సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ చిత్రంలో ఆయన వంటమనిషి 'అఖ్లాక్'గా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాకుండా, జాతీయ అవార్డు గెలుచుకున్న కృతి సనన్ చిత్రం ‘మిమి’, సంజయ్ మిశ్రా నటించిన విమర్శకుల ప్రశంసలు పొందిన ‘వాధ్’, మరియు ‘మై లడేగా’ వంటి సినిమాల్లో కూడా నదీమ్ నటించాడు.
ఇలా వరుసగా పేరున్న బ్యానర్లలో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయంలోనే, పదేళ్ల క్రితం మొదలైన ఈ వికృత చేష్టలు ఇప్పుడు అతడిని కటకటాల వెనక్కి నెట్టాయి. బయటకు గౌరవప్రదమైన నటుడిగా కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక దశాబ్ద కాలంగా ఒక మహిళ జీవితంతో ఆడుకున్నాడనే వార్త అతడి ఇమేజ్‌ను ఒక్కసారిగా మసకబార్చింది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.