ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించబోతున్న చిత్రాలు/ సిరీస్ లో ఇవే!
మరి ఈ వారం ఓటిటి ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్న ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం..;
ఇటీవల కాలంలో థియేటర్లలో సినిమాలు సందడి చేస్తుంటే.. ఆ థియేటర్లలో వచ్చిన చిత్రాలను అక్కడికి వెళ్లి చూడడానికి టైం లేని చాలామంది ఓటీటీల పైన ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీలు ఆడియన్స్ ను ఆకర్షించడానికి.. దీనికి తోడు మంచి టిఆర్పి రేటింగ్ తో పాటు ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వివిధ జానర్లలో సినిమాలు అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించడానికి కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు సిద్ధం అయ్యాయి. మరి ఈ వారం ఓటిటి ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్న ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
నెట్ ఫ్లిక్స్:
టేక్ దట్:
ఈ సిరీస్ బ్రిటన్ కి చెందిన బాయ్ బ్యాండ్ ప్రయాణాన్ని మూడు భాగాలుగా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. జనవరి 27న నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
బ్రిడ్జిటన్ సీజన్ 4(పార్ట్ 1)
జనవరి 29న నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ధురంధర్:
బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేకక్ చేసిన ధురంధర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. రణవీర్ సింగ్ హీరోగా , సారా అర్జున్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం నిజ జీవిత ఆధారంగా రూపొందించారు. జనవరి 30 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఛాంపియన్:
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ నటించిన ఈ సినిమా జనవరి 29న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
పతంగ్:
స్నేహానికి, ప్రేమకి ముడిపెడితూ రూపొందించిన చిత్రం ఇది. గత ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జనవరి 30న సన్ నెక్స్ట్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది.
అమెజాన్ ప్రైమ్ :
ఆది శంబాల - జనవరి 26
ది రీకింగ్ క్రూవ్ -జనవరి 28
దాల్ దాల్- జనవరి 30వ తేదీ
జీ -5:
దేవ్ ఖేల్ - జనవరి 30వ తేదీ
ఈటీవీ విన్:
గొల్ల రామవ్వ- జనవరి 25
ఆహ:
ష్రింకింగ్ సీజన్ 3- జనవరి 28