వీకెండ్ లో అలరించనున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్ లివే!

వారమంతా బిజీగా గడిపిన సినిమా ప్రియులకు వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో ఏ కొత్త సినిమాలు వచ్చాయా అని వెతకడం అలవాటు.;

Update: 2026-03-13 11:47 GMT

వారమంతా బిజీగా గడిపిన సినిమా ప్రియులకు వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో ఏ కొత్త సినిమాలు వచ్చాయా అని వెతకడం అలవాటు. ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులకు భారీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. రవితేజ యాక్షన్ డ్రామా నుండి విశ్వక్ సేన్ కామెడీ ఎంటర్టైనర్ వరకు, అలాగే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. థియేటర్లకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేసేందుకు సరిపడా ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. మరి వాటి గురించి మనం ఓ లుక్ వేద్దాం..

అమెజాన్ ప్రైమ్ వీడియో :

అమెజాన్ ప్రైమ్‌లో ఈ వారం యూత్ ఫుల్ డ్రామాలు సందడి చేస్తున్నాయి. సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా నేటి తరం రిలేషన్ షిప్స్ ఎలా ఉంటాయో చూపిస్తూ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అనుపమ పరమేశ్వరన్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘లాక్‌డౌన్’ కూడా అందుబాటులో ఉంది. వెబ్ సిరీస్ ప్రియుల కోసం ‘ఆస్పిరెంట్స్’, ‘లోకల్ టైమ్స్’ మరియు ‘ది తాజ్ స్టోరీ’ వంటి చిత్రాలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ :

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వీకెండ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమాతో నవ్వులు పూయిస్తున్నాడు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్‌గా నిలుస్తోంది. అలాగే ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేడిన్ కొరియా’ నేరుగా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంటోంది. వీటితో పాటు మలయాళ హిట్ ‘పెన్నుమ్ పోరాట్టమ్’ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇంటర్నేషనల్ సిరీస్ ఇష్టపడేవారి కోసం ‘వన్‌ పీస్: సీజన్ 2’, ‘గ్లాడియేటర్ 2’ వంటి భారీ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి.

జీ5 & ఆహా :

ఇక జీ5లో మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పలకరిస్తున్నాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక మన ఊరి ఓటీటీ ఆహా లో హారర్ థ్రిల్లర్ ‘రవం’ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఈటీవీ విన్ లో ఫాదర్ సెంటిమెంట్‌తో సాగే ‘నవాబ్స్ కేఫ్’ సినిమా ఈ వారం ఒక మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే, ఈ వీకెండ్ అన్ని రకాల జోనర్ల సినిమాలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కళకళలాడుతున్నాయి.

Tags:    

Similar News