పుష్ప రాజ్ మాస్ ప్లానింగ్.. అస్సలు తగ్గేదేలే..!

పుష్ప రెండు భాగాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ సినిమా అంటే చాలు నేషనల్ లెవెల్ లో ఒక రేంజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.;

Update: 2026-01-26 09:30 GMT

పుష్ప రెండు భాగాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ సినిమా అంటే చాలు నేషనల్ లెవెల్ లో ఒక రేంజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పుష్ప రాజ్ గా పూనకాలు తెప్పించే పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన ఐకాన్ స్టార్ నెక్స్ట్ అట్లీతో మరో అద్భుతానికి రెడీ అవుతున్నాడు. అట్లీ తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ప్రతి అప్డేట్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో అల్లు అర్జున్ సినిమా లాక్ చేసుకున్నాడు. కూలీతో కాస్త డిజప్పాయింట్ చేసిన లోకేష్ బన్నీ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.

అర్జున్ రెడ్డి తో సత్తా చాటి..

ఐతే ఈ రెండే కాదు అల్లు అర్జున్ ఈ రెండిటి తర్వాత రాబోయే సినిమా ప్లానింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా తో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తన సత్తా చాటి యానిమల్ తో నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమాను ముందు అల్లు అర్జున్ తోనే చేయాలని అనుకున్నాడు. అప్పుడు కుదరలేదు కానీ ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.

సో అట్లీ, లోకేష్ ఆ తర్వాత సందీప్ వంగ.. అల్లు అర్జున్ సినిమాల ప్లానింగ్ చూస్తుంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అనేలా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమాలతో బన్నీ మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన మాస్ స్టామినా చూపించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఓ పక్క ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తుంటే ఆ తర్వాత ప్లేస్ లో అల్లు అర్జున్ కూడా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నాడు.

మహేష్ రాజమౌళి సినిమాతో..

తెలుగు నుంచి ప్రభాస్ ఆ తర్వాత అల్లు అర్జున్ ఇద్దరు కూడా టాలీవుడ్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ వారి దారిలోనే ఎన్ టీ ఆర్, రాం చరణ్ కూడా వెళ్తున్నారు. ఇక మహేష్ కూడా రాజమౌళి సినిమాతో చేస్తున్నాడు. తప్పకుండా ఈ స్టార్స్ అంతా కూడా టాలీవుడ్ ని కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్తున్నారు.

ప్రభాస్ లైన్ లో ఫౌజీ, స్పిరిట్ ఉన్నాయి. అవే కాకుండా సలార్ 2, కల్కి 2 చేయాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ కూడా 3 సినిమాలు లైన్ లో పెట్టాడు. మహేష్ వారణాసి కోసం 2 ఏళ్లు టైం ఇవ్వగా చరణ్ పెద్ది ఆ నెక్స్ట్ సుకుమార్ సినిమాలు చేస్తున్నాడు. ఇక తారక్ మాత్రం ప్రశాంత్ నీల్ తో సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలన్నీ కూడా టాలీవుడ్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రేంజ్ మాస్ ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి.

Tags:    

Similar News