నిజంగానే ఎన్టీఆర్‌ నో చెప్తే చరణ్‌ ఓకే చెప్పాడా?

Update: 2022-11-27 15:31 GMT
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంటనే ఎన్టీఆర్ నుండి పిలుపు వచ్చింది. ఎన్టీఆర్ కి స్టోరీ లైన్‌ ని చెప్పే అవకాశం బుచ్చిబాబుకి దక్కింది.

స్టోరీ లైన్ నచ్చడంతో ఎన్టీఆర్ వెంటనే సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ యొక్క ఇతర ప్రాజెక్టు కారణంగా బుచ్చిబాబు సినిమా ఆలస్యం అవుతుంది అంటూ అంతా భావిస్తూ వచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే బుచ్చిబాబు రెడీ చేసిన స్క్రిప్ట్ సరిగా లేదని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథని రామ్ చరణ్ వద్దకు తీసుకు పోగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. రేపు ప్రకటించబోతున్న సినిమా అదే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ తో సినిమా తర్వాత ఎన్టీఆర్.. బుచ్చిబాబు సినిమా ఉంటుందని, రామ్ చరణ్ కి చెప్పిన కథ కొత్తది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ కి ఏదైతే కథను చెప్పాడో అదే కథను రామ్ చరణ్ వద్ద ఉంచాడని.. ఎన్టీఆర్ కి నచ్చక పోయినా అదే కదా రామ్ చరణ్ కి నచ్చిందని ప్రచారం జరుగుతుంది.

గతంలో ఒక హీరో నో చెప్పిన కథలు మరో హీరో చేయగా సూపర్ హిట్ అయ్యాయి. కనుక ఈ సినిమా రామ్ చరణ్ కి సక్సెస్ ని ఇస్తుందేమో చూడాలి అంటూ మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంతకు ఇది ఎన్టీఆర్ నో చెప్పిన కథేనా అంటూ మరి కొందరు మాట్లాడుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News