బయోపిక్‌ ను కూడా ఇలాగే తీస్తా : బోయపాటి

Update: 2019-01-10 15:10 GMT
ఒకప్పుడు యాక్షన్‌ సినిమాలకు బి గోపాల్‌ పెట్టింది పేరు, కాని ఇప్పుడు ఆయన్ను మించి పోయి మరీ యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు బోయపాటి  శ్రీను. హీరో ఎవరైనా, కథ ఏదైనా కూడా తనదైన మార్క్‌ యాక్షన్‌ స్క్రీన్‌ ప్లేతో సినిమాను దడదడలాడివ్వడం బోయపాటికి అలవాటు. తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం చరణ్‌ కెరీర్‌ లోనే అత్యంత మాస్‌ సినిమాగా ఉంటుందని మెగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

వినయ విధేయ రామ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ... తాను యాక్షన్‌ జోనర్‌ తప్ప మరే జోనర్‌ లో సినిమాను చేయను. ప్రేక్షకులు నా నుండి ఇలాంటి సినిమాలను ఆశిస్తున్నప్పుడు వేరే జోనర్‌ లో సినిమా తీయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. కథలు మారినా, హీరోలు మారినా నేను నా జోనర్‌ లోనే సినిమా తీస్తానన్నాడు.

నా కెరీర్‌ లో ఎప్పుడో ఒకసారి బయోపిక్‌ తప్పకుండా తీస్తాను. ఆ బయోపిక్‌ లో కూడా నా మర్క్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా తీస్తానని బోయపాటి అన్నాడు. అయితే ఎవరి బయోపిక్‌ తీసేది మాత్రం బోయపాటి క్లారిటీ ఇవ్వలేదు. చిన్న సినిమాలు, క్లాస్‌ సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. వినయ విధేయ రామ చిత్రం తర్వాత బాలకృష్ణ తో ఒక మూవీ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కాని బోయపాటి మాత్రం ఇంకా ఆ మూవీ ఫైనల్‌ కాలేదన్నాడు. చిరంజీవితో కూడా బోయపాటి ఒక చిత్రం చేయాల్సి ఉంది. ఆ సినిమాకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. బాలయ్యతోనే బోయపాటి తర్వాతి మూవీ ఉంటుందేమో చూడాలి.



Full View
Tags:    

Similar News