నటిని అసహ్యించుకునేలా చేసిన పాత్ర అది!
అవికా గోర్ అలియాస్ `చిన్నారి పెళ్లి కూతురు` పరిచయం అవసరనం లేని పేరు. బుల్లి తెరతో పాటు వెండితెరపైన తనదైన ముద్రవేసిన బ్యూటీ.;
అవికా గోర్ అలియాస్ `చిన్నారి పెళ్లి కూతురు` పరిచయం అవసరనం లేని పేరు. బుల్లి తెరతో పాటు వెండితెరపైన తనదైన ముద్రవేసిన బ్యూటీ. తాజాగా కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా ఓ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ఆమె నటించిన తాజా చిత్రం `అగ్లీ స్టోరీ` షూటింగ్ సమయంలో మొదటిసారి తీవ్రమైన అసౌకర్యానికి లోనయ్యానని పేర్కొంది. నటిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించినా? ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర తనను తాను అసహ్యించుకునేలా చేసిందని ఆమె చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా నటీనటులు పాత్రల్లో లీనమై నటించడం సహజం. కానీ `అగ్లీ స్టోరీ`లో తన పాత్ర ఆలోచనా విధానం, ప్రవర్తన వ్యక్తిగత విలువలకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అవికా పేర్కొంది. ఆ పాత్రలో నైపుణ్యం లేనితనం, అందులోని నెగటివ్ షేడ్స్ తనను మానసికంగా కలచివేసాయంది. కెమెరా ముందు ఆ పాత్రలా ప్రవర్తించడం నటిగా అనివార్యమైనా? లోలోపల మాత్రం తాను ఎంతో మదనపడ్డానంది. ఆ క్యారెక్టర్ తనను ఒక రకమైన జుగుప్సకు గురిచేసిందని ఆమె వాపోయింది. షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రస్తావిస్తూ అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు కూడా ఆ పాత్ర తాలూకు ప్రభావం ఉందని తెలిపింది.
`నా కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. కానీ ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు ఇంతలా అసౌకర్యంగా ఫీల్ అవ్వడం ఇదే మొదటిసారి అని తెలిపింది. ఆ పాత్ర గ్రే షేడ్స్ , కథాంశంలోని తీవ్రత వల్ల సెట్స్‌లో కూడా తాను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలే కపోయానని గుర్తు చేసుకుంది. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఒప్పుకున్నా? షూటింగ్ దశకు వచ్చేసరికి ఆ పాత్రలోని సంక్లిష్టత తనను ఇబ్బంది పెట్టిందని అవికా అభిప్రాయపడింది. ఒక నటిగా అన్ని రకాల భావోద్వేగాలను పండించాల్సి ఉన్నా కొన్నిసార్లు ఆ పాత్రల ప్రభావం వ్యక్తిగత జీవితంపై కూడా పడుతుందని అవిక వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.
గ్లామర్ కోసమో లేదా కమర్షియల్ విలువల కోసమో కాకుండా ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఇలాంటి అసౌకర్యమైన, కష్టమైన పాత్రను ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ చిత్రం పేరుకు తగ్గట్టే సమాజంలోని కొన్ని అగ్లీ (వికృతమైన) కోణాలను ఆవిష్కరించబోతోందని తెలుస్తోంది. అందుకే ఆ ప్రభావం నటీనటులపై కూడా బలంగా పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అవికా గోర్ వంటి సీనియర్ నటి ఇంతలా స్పందించారంటే? ఆ పాత్ర ఎంతటి గాఢతతో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు.
నటన పట్ల ఆమెకున్న అంకితభావం వల్లే ఇష్టం లేకపోయినా? ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ఆమె ప్రయత్నించారని టీమ్ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రతిభావంతులైన నటీనటులకు కొన్ని పాత్రలు వరంగా మారితే? మరికొన్ని పాత్రలు మానసిక సవాలుగా మారుతుంటాయి. అవికా గోర్ `అగ్లీ స్టోరీ` తో ఓ కొత్త తరహా ప్రయోగానికి పూనుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు ఆమె పాత్రను ఎలా స్వీకరిస్తారో? ఆమె పడ్డ ఇబ్బందికి తగిన గుర్తింపు లభిస్తుందో లేదో? చూడాలి.