రష్మిక వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తేసిన నటి!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంత జోవియల్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తనలో ఆ లక్షణమే అమ్మడికి కెరీర్ పరంగానూ ఎంతో కలిసొచ్చింది.;
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంత జోవియల్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తనలో ఆ లక్షణమే అమ్మడికి కెరీర్ పరంగానూ ఎంతో కలిసొచ్చింది. చలాకీగా మాట్లాడటం..యువతను ఆకట్టుకునే విధానంతో టాలీవుడ్ సహా బాలీవుడ్ లోనూ వేగంగా ఎదగగలిగింది. తాజాగా రష్మిక వ్యక్తిత్వం గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి `కాక్టెయిల్ 2` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ రష్మికలో సానుకూల దృక్పథం తనను ఆకట్టుకుందని కృతి పేర్కొన్నారు.
సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తున్నప్పుడు వారి మధ్య పోటీ లేదా అభద్రతా భావం ఉంటుంది. కానీ రష్మిక విషయంలో అలాంటివి ఏవీ లేవని కృతి స్పష్టం చేసింది. రష్మిక మందన్న సెట్స్‌పై ఎంతో సరదాగా ఉంటుంది. అందరితో చాలా త్వరగా కలిసిపోతుంది. ఆమెకు ఎలాంటి అభద్రతా భావం లేదు. తను ఎప్పుడూ ఇతరులను ప్రోత్సహిస్తూ సెట్స్‌లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని కృతి కొనియాడారు. రష్మిక తన పాత్రపై ఎంత శ్రద్ధ చూపిస్తుందో? తోటి నటీనటుల ప్రదర్శనను కూడా అంతే గౌరవిస్తుందన్నారు.
ఈ విధమైన ప్రవర్తన వల్ల షూటింగ్ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా సాగుతుందని కృతి పేర్కొంది. కృతి , రష్మికల మధ్య కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. రష్మిక ఇప్పటికే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలతో దూసు కుపోతుంది. తాజాగా కృతి సనన్ వంటి సీనియర్ నటి నుండి రష్మికకు ఇలాంటి ప్రశంసలు దక్కడం విశేషం. సెలబ్రిటీల మధ్య ఉండే వృత్తిపరమైన పోటీని పక్కన పెట్టి ఒకరినొకరు గౌరవించుకోవడం ఆరోగ్యకరమైన పరిణామం.
ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ -బాలీవుడ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీ షెడ్యూల్‌లో ఉంది. `కాక్టెయిల్ `కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న `కాక్టెయిల్ 2` పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా గనుక హిట్ అయితే ఉత్తరాదిన రష్మిక ఇమేజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం రష్మిక కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు లేడీ ఓరియేటెడ్ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతుందని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.