ఆ స్టార్ హీరో సోద‌రి ట్యాలెంట్ గుర్తించిన లెజెండ్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కపూర్ ఖాందాన్ వారసులంద‌రితో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతార‌న్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-05-09 00:30 GMT

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కపూర్ ఖాందాన్ వారసులంద‌రితో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ కుటుంబాల‌కు సంబంధించిన ఎలాంటి విష‌యాలైనా? ఓపెన్ గా పంచుకుంటారు. తాజాగా రణబీర్ కపూర్ సోదరి రిద్దిమ కపూర్ సాహ్ని గురించి అమీర్ ఖాన్ ఆస‌క్తిక‌ర విషయాలను పంచుకున్నారు. గతంలో వారి ఇంట్లో జరిగిన ఓ వేడుకను ఉద్దేశించి రిద్దిమ నటనలో రణబీర్ కంటే మెరుగ్గా రాణించిందని అమీర్ కితాబు ఇచ్చారు. `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో` లో నీతూ కపూర్, రిద్దిమ , ర‌ణబీర్ పాల్గొన్న ఎపిసోడ్ తర్వాత అమీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

`దాదీ కీ షాదీ` అనే ఒక సరదా నాటకంలో రిద్దిమ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఆ సమయంలో రణబీర్ కంటే రిద్దిమ ఎంతో సహజంగా ఆత్మవిశ్వాసంతో నటించిందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ రిద్దిమ గ‌నుక సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఉంటే? ఆమె ఖచ్చితంగా గొప్ప నటి అయ్యేదని అమీర్ ప్రశంసించారు. కపూర్ కుటుంబంలో ప్రతి ఒక్కరిలోనూ నటన అనేది రక్తంలోనే ఉందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. రిద్దిమ కపూర్ లైమ్‌లైట్‌కు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.

ఆమె జ్యువెలరీ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అమీర్ ఖాన్ వంటి అగ్ర హీరో ఆమెలోని నటిని గుర్తించి ప్రశంసించడం విశేషం. ప్రస్తుతం రణబీర్ కపూర్ బాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకుపోతున్న తరుణంలో ఆయన సోదరి గురించి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పుడు రిద్దిమ తన చిన్ననాటి ముచ్చట్లను, రణబీర్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుని ప్రేక్షకులను అలరించారు. రణబీర్ కూడా సోదరి టాలెంట్ గురించి గతంలో పలుమార్లు సానుకూలంగా స్పందించారు.

స్టార్ కిడ్స్ అంతా నటన వైపు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో రిద్దిమ మాత్రం తనకిష్టమైన వ్యాపార రంగంలో స్థిరపడటం వ్యక్తిత్వాన్ని చాటిచెబుతోంది. రిద్దిమ‌లో గొప్ప నటి దాగి ఉందనేది వాస్తవం. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ , సంభాషణలు చెప్పే తీరును చూస్తుంటే వెండితెర గొప్ప న‌టిని కోల్పోయిందా అని అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నటన అనేది కేవలం కెరీర్ మాత్రమే కాదు. అదొక‌ కళ అని రిద్దిమ వంటి వారు నిరూపిస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రశంసలు రిద్దిమకు దక్కిన ఒక గొప్ప గౌరవంగా భావించొచ్చు. ఆమె సినిమాల్లోకి రాకపోయినా? రిద్దిమ‌లోని ఈ ప్రతిభ ఎప్పుడూ గుర్తింపు పొందుతూనే ఉంటుంది.

Tags:    

Similar News