Bigg Boss Telugu 10: మానిప్యులేటర్లు.. పప్పెట్లు

బిగ్‌బాస్ హౌస్‌లో అత్యంత కన్ఫ్యూజ్డ్ హౌస్‌మేట్ వర్షిణి అని పేరు పడింది. 90% ప్రేక్షకులు కూడా ఇదే చెప్పి థంబ్స్ డౌన్ ఇచ్చారు.

Update: 2026-09-20 05:44 GMT

బిగ్ బాస్ షో మొదటి వారం లోనే త్రిగున్ కి రోహిత్ కి మధ్య కాంపిటేషన్ ఫిక్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే మొదటి వారాంతం లో త్రిగున్ కి ఎక్కువ క్లాస్ తీసుకోకుండా కేవలం రోహిత్ కి ఎక్కువ కోటింగ్ ఇవ్వడంతో ఆడియన్స్ కి చాలా మందికి నచ్చలేదు. అయితే రెండో వారాంతం లో కూడా రోహిత్ ఆట మీద అతనికే డవుట్ వచ్చే విధంగా నాగార్జున వ్యవహరించారు. ఒక వైపు గేమ్ హిట్ అని సూచిస్తునే ఆట విధానం మార్చుకోవాలని చెప్తూ ఒక డైలమా క్రియేట్ చేసారు.

కెప్టెన్సీ టాస్క్‌లో దేబ్జానీ ఓడిపోయినా నాగ్ మనసు గెలుచుకుంది. మొదటి నుంచీ నాగ్ ఆమెను స్పెషల్‌గానే చూస్తున్నారు. మిగతా హౌస్ అంతా నోరు పారేసుకుంటూ స్పాట్‌లైట్ కోసం ప్రయత్నిస్తుంటే, దేబ్జానీ మాత్రం ఫెయిర్ గేమ్ ఆడుతోందని బిగ్‌బాస్ ఫాలో అయ్యే ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమె పెట్టే పాయింట్స్ కూడా చాలా కన్విన్సింగ్ గా ఉంటాయి.

ఇక హౌస్‌లో మానిప్యులేటర్ ఎవరు పప్పెట్ ఎవరు అని నాగ్ హౌస్‌మేట్స్‌ను అడిగారు.

అయితే ఈ క్రమంలో వర్షిణి మానిప్యులేటర్ అని చరణ్ చెప్పాడు. సుధీర్‌ను పప్పెట్ అన్నాడు. షాలిని కూడా ఇదే మాట చెప్పింది. అయితే, ఆమె మాటలకు ప్రేక్షకులు 'నో' చెప్పారు. రామ్ ప్రసాద్ త్రిగుణ్‌ను మానిప్యులేటర్ అని, వంశీని పప్పెట్ అని అన్నాడు.. దేబ్జానీ కూడా ఇదే చెప్పింది. త్రిగుణ్ రైవల్ రోహిత్ కూడా ఇదే మాట అన్నాడు.

నిజానికి గత కొద్ది రోజులుగా నెటిజన్లు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. త్రిగుణ్ ట్రాప్‌లో వంశీ పడిపోయినట్లు ప్రవర్తిస్తున్న విధానాన్ని హౌజ్ మొత్తం వేలెత్తి చూపించింది. వర్షిణి రోహిత్‌ను మానిప్యులేటర్ అంది... ఆసక్తికరంగా, ఎక్కువ మంది ప్రేక్షకులు కూడా ఇదే మాట చెప్పారు. పవర్ ఆఫ్ పీపుల్. రోహిత్‌కి చరణ్ పప్పెట్ అని వర్షిణి చెప్పింది.

బిగ్‌బాస్ హౌస్‌లో అత్యంత కన్ఫ్యూజ్డ్ హౌస్‌మేట్ వర్షిణి అని పేరు పడింది. 90% ప్రేక్షకులు కూడా ఇదే చెప్పి థంబ్స్ డౌన్ ఇచ్చారు. ఈ వారం ఆమెకు సంచాలక్ అయ్యే అవకాశం లేదని నాగ్ తేల్చి చెప్పారు కూడా.

పనుల విషయంలో జరిగిన గొడవలో వర్షిణి షాలినిని నెట్టేసింది. ఇందులో షాలిని తప్పు కూడా ఉందని నాగ్ క్లాస్ పీకాడు. కోపం ప్రమాదకరం అని షాలినికి సూచించాడు. పనుల విషయంలో రోహిత్‌కు కూడా గట్టిగానే క్లాస్ పడింది.

ఇకపోతే హౌస్‌లో అతి పెద్ద మానిప్యులేటర్ త్రిగుణ్ అని నాగార్జున తేల్చారు. రామ్ ప్రసాద్ సైతం అతన్ని కన్నింగ్ అన్నాడు. కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్‌ను టార్గెట్ చేయడంపై నాగ్ త్రిగుణ్‌కు పెద్ద క్లాస్ తీసుకున్నాడు. మరోవైపు రోహిత్‌ను ఉద్దేశించి.. నీ పేరులోనే HIT ఉందని, నీ గేమ్ కూడా హిట్ అని నాగ్ అన్నాడు... కానీ ఆడుతున్న విధానంలోనే లోపం ఉందని, దాన్ని మార్చుకోవాలని సూచించాడు.

Tags:    

Similar News