మాస్ హీరోలకే ఎక్కువ క్రేజ్ ఎందుకు... క్లాస్ హీరోలను పట్టించుకోరా...
కాబట్టి ఆ హీరో చేసే సినిమాలను చూసే ఆడియన్ కి హీరోకి తేడా ఏమీ ఉండదు. థియేటర్ కి వెళ్ళి కూడా ఇంట్లో తను పడే ఇబ్బందులను స్క్రీన్ మీద చూడటానికి ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ ఉండదు.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన హీరోలకు మాత్రమే క్రేజ్ ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తూ వాళ్ల క్రేజ్ ను, మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సక్సెసుల్లో ఉన్న హీరోలతో సినిమాలు చేస్తే సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ ఉంటారు. అందుకోసమే హీరోలు ఒక్క భారీ సక్సెస్ ను సాధించి టాప్ పొజిషన్ కి వెళ్ళాలని చూస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది వరుస సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఒక విజయాన్ని అందుకోవడానికి సంవత్సరాలపాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో టార్గెట్ మాస్ హీరోగా ఎదగడమే కారణం ఏంటి అంటే మాస్ హీరో కి ఉన్న క్రేజ్ క్లాస్ హీరోలకి ఉండడం లేదు. నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో మాస్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టే మెగాస్టార్ గా మారాడు. ఇక ఇతర హీరోలు కొంతవరకు క్లాస్ ని మాస్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్లు తన తర్వాత పొజిషన్ ను కైవసం చేసుకున్నారు...
మాస్ హీరో కి ఎందుకంత ఫాలోయింగ్ అంటే మాస్ హీరో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, తనకనిపించింది చేస్తాడు. ఎవరితోనైనా సరే ఫైట్ కి దిగుతాడు, ప్రతి ఒక్క సిచువేషన్ ను తన కంట్రోల్ లోకి తీసుకుంటాడు. కాబట్టి మాస్ హీరోని ప్రతి ప్రేక్షకుడు ఓన్ చేసుకుంటాడు. కొంతమంది తమ నిజజీవితంలో చేయలేని పనులను మాస్ హీరో స్క్రీన్ మీద చేస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు అతనికి కనెక్ట్ అయిపోతాడు. అందుకే మాస్ హీరోకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక క్లాస్ హీరో విషయానికి వస్తే ఆయన చాలా పద్ధతిగా ఇన్షార్ట్ వేసుకొని ఉంటాడు. ఫ్యామిలీ సినిమాలను చేస్తూ వెళ్తాడు. నిజానికి సినిమాను చూసే ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి ఇలానే ఉంటాడు.
కాబట్టి ఆ హీరో చేసే సినిమాలను చూసే ఆడియన్ కి హీరోకి తేడా ఏమీ ఉండదు. థియేటర్ కి వెళ్ళి కూడా ఇంట్లో తను పడే ఇబ్బందులను స్క్రీన్ మీద చూడటానికి ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అలాంటి క్లాస్ హీరోని చూడటానికి కొందరికి బోర్ కొట్టొచ్చు. కానీ మాస్ హీరో మాత్రం మనం చేయలేని పనులన్నింటిని చేస్తాడు కాబట్టి ప్రేక్షకుల్లో మాస్ హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్క హీరో మాస్ హీరోగా ఎదగాలనే టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. వాళ్ళ సినిమాలను ప్రేక్షకులు రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లోనే వస్తుంటాయి...
ఇక క్లాస్ హీరోలు కూడా భారీ విజయాలను దక్కించుకున్నప్పటికి మాస్ హీరోల సినిమాలు కలెక్ట్ చేసినంత కలెక్షన్స్ ను రాబట్టలేకపోతున్నాయి. అందుకే కొత్తగా వచ్చిన హీరోలు సైతం రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మాస్ జపం చేస్తూ ఉంటారు. ఒక్క మాస్ సినిమాతో తమ కెరియర్ ను మార్చేసుకోవచ్చు అంటూ ఎవరికి వారు ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు సాగుతారు. మాస్ మూవీస్ చేసి ఇక్కడ అందరు సక్సెస్ సాధిస్తారా అంటే అది కుదరదు. కొంతమంది బాడి లాంగ్వేజ్ కి మాత్రమే ఆ మాస్ గెటప్ కానీ, ఆ లుక్ కానీ, ఆ రగుడ్ క్యారెక్టర్జేషన్ గాని సెట్ అవుతుంది. వాళ్లను మాత్రమే ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు...