ఈ హీరోల కలయికలో మల్టీస్టారర్ మూవీస్ వస్తే రికార్డులు గల్లంతేనా...
అలాంటి సందర్భంలోనే ఇంకా కొంతమంది హీరోలు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే బాగుంటుందని వాళ్ళ అభిమానులు సైతం తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే హీరోలు కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి హీరోలు సోలోగా స్క్రీన్ మీద కనిపిస్తేనే రికార్డులు బ్రేక్ అవుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే పక్కాగా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే అదొక అద్భుతమైన రికార్డుగా నిలిచిపోతుందని మరికొంతమంది భావిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా చేసిన 'త్రిబుల్ ఆర్' సినిమా సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఈ సినిమా దాదాపు 1400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక దానికి తోడుగా హాలీవుడ్ లో సైతం ఈ సినిమా గురించి అక్కడి మేకర్స్ మాట్లాడుకున్నారు అంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భంలోనే ఇంకా కొంతమంది హీరోలు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే బాగుంటుందని వాళ్ళ అభిమానులు సైతం తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఏ ఇద్దరు హీరోలు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే బాగుంటుందనే విషయాని వస్తే రామ్ చరణ్ - అల్లు అర్జున్ కలయికలో ఒక సినిమా వస్తే ఆ సినిమా ఈజీగా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెడుతుందని వాళ్ళు భావిస్తున్నారు...
మహేష్ బాబు - ప్రభాస్ కాంబినేషన్లో సినిమా వస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళిద్దరు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీళ్ళ కోసం సినిమాలను చూడడానికి ఎక్కువ సంఖ్యలో జనాలు ఆసక్తి చూపిస్తారు. తద్వారా సినిమా కనక బాగుంటే మాత్రం అది ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను కూడా అలరిస్తుందనేది వాస్తవం...
ఇక గత 50 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గా గుర్తుండిపోయిన చిరంజీవి - బాలకృష్ణ కాంబోలో ఒక సినిమా వస్తే మాత్రం యావత్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న వీళ్ళిద్దరి అభిమానులకు కన్నుల పండగనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ఒకరికొకరు పోటీ పెట్టుకొని సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. మొత్తానికైతే హిట్ సినిమాలు చేసుకుంటూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నప్పటికి అది అప్పటినుంచి ఇప్పటివరకు కార్యర్యమైతే దాల్చలేదు... కొన్ని వేదికల మీద చిరంజీవి బాలకృష్ణతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కామెంట్లు చేశాడు. దానికి బాలయ్య సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు... ఇక ఫ్యూచర్ లో ఈ కాంబినేషన్ కనక వర్కౌట్ అయితే మాత్రం వాళ్ల అభిమానులకు పూనకలు పక్కా అనే చెప్పాలి...