మా బంధాన్ని కించపరుస్తావా అంటూ ఫైర్!
బుల్లితెర మోస్ట్ పాపులర్ కపుల్ కరణ్ కుంద్రా - తేజస్వీ ప్రకాష్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననే తెలుస్తోంది.;
బుల్లితెర మోస్ట్ పాపులర్ కపుల్ కరణ్ కుంద్రా - తేజస్వీ ప్రకాష్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననే తెలుస్తోంది. `దేశీ బ్లింగ్` తాజా వీడియోలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ రిలేషన్‌షిప్‌ను తేజస్వీ గౌరవించడం లేదని దానిని తక్కువ చేసి మాట్లాడుతోందని కరణ్ కుంద్రా ఆమెను నిలదీయడం వీడియోలో చూడొచ్చు. నిత్యం అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఇలాంటి మాటల యుద్ధం జరగడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. కరణ్ కుంద్రా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. తామిద్దరి మధ్య ఉన్న బంధం పట్ల తేజస్వీ ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం బాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
`నువ్వు మన రిలేషన్‌షిప్‌ను అగౌరవపరుస్తున్నావు` అంటూ నేరుగా ఆమెను ప్రశ్నించారు. కరణ్ అంత సీరియస్‌గా మాట్లాడటంతో తేజస్వీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా? కరణ్ కోపం తగ్గకపోవడంతో ఆమె కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఇద్దరి మధ్య ఇంతటి తీవ్రమైన చర్చ జరగడం వెనుక అసలు కారణం ఏంటనేది మిస్టరీగా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే తేజ్రాన్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు కరణ్ పద్ధతిని తప్పుబడుతుండగా మరికొందరు తేజస్వీ చేసిన పొరపాటు ఏంటో తెలుసుకోకుండా కరణ్‌ను విమర్శించలేమని అభిప్రాయపడుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ నుండి మొదలైన వీరి ప్రేమాయణం బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంతో దృఢంగా సాగుతోంది. అయితే ఇటీవల కాలంలో ఇద్దరు కలిసి కనిపించడం లేదనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ వీడియో ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. నిజానికి దేశీ బ్లింగ్ అనేది షూటింగ్ ప్రాజెక్టులో భాగం. ఇది సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేస్తున్న డ్రామా అయి ఉంటుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన ఈ జంటకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను వాడుకోవడానికి మేకర్స్ ఇలాంటి ప్లాన్ చేసి ఉండొచ్చనే టాక్ టాక్ నడుస్తోంది.
కానీ వీడియోలో తేజస్వీ ఏడుస్తోన్న తీరు చూస్తుంటే అది నటనలా అనిపించడం లేదని వారి మధ్య ఏదో బలమైన కారణమే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కరణ్ కుంద్రా - తేజస్వీ ప్రకాష్ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఓవైపు మ్యూజిక్ వీడియోలు, మరోవైపు టీవీ షోలతో దూసుకుపోతున్న జంట మధ్య వ్యక్తిగత కారణాలతో విభేదాలు తలెత్తి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. తమ రిలేషన్ షిప్ ని ఎప్పుడూ పబ్లిక్‌గా సెలబ్రేట్ చేసుకునే జంట ఇప్పుడిలా గొడవ పడటం చూస్తుంటే సెలబ్రిటీల రిలేషన్‌షిప్స్ ఎంత సున్నితంగా ఉంటాయో మరోసారి అర్థమవుతోంది.