పూజా హెగ్డేను ఆపడం ఇప్పట్లో కష్టమే!
సాధారణంగా ఒక భాషలో హీరోయిన్ గా మంచి గుర్తింపు వస్తున్నప్పుడు, ఎవరూ కూడా తొందరపడి మరో ఇండస్ట్రీకి పరిగెత్తరు. ఎందుకంటే మళ్లీ తిరిగివచ్చేవరకూ ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుందో లేదో తెలియదు. అలా వెళ్లిపోయాయి కొంత గ్యాప్ తరువాత తిరిగి వచ్చినవారిలో సక్సెస్ అయిన వాళ్లు కూడా చాలా తక్కువమందే. ఆ అతికొద్దిమందిలోనే పూజా హెగ్డే స్థానాన్ని దక్కించుకుంది. గ్యాప్ తీసుకుని వచ్చినప్పటికీ, గ్యాప్ లేకుండా సక్సెస్ లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయా .. ఎప్పుడు తమ సినిమా విడుదలవుతుందా అని చాలామంది హీరోయిన్లు వెయిట్ చేస్తుంటే, లాక్ డౌన్ కి ముందే 'అల వైకుంఠపురములో' సినిమాతో హిట్ కొట్టేసి కూల్ గా కూర్చోవడం పూజా హెగ్డే అదృష్టానికి ఓ మచ్చుతునక.
హీరోయిన్లకు వరుసగా ఒకటి రెండు హిట్లు పడటం గొప్పవిషయం. అలాంటిది వరుసగా పూజా హెగ్డే నాలుగు హిట్లను నమోదు చేసింది. అందులో మూడు సినిమాలు స్టార్ హీరోలవే కావడం మరింత విశేషం. 'అరవింద సమేత' .. 'మహర్షి' .. 'గద్దలకొండ గణేశ్' .. 'అలవైకుంఠపురములో' సినిమాలు పూజా హెగ్డే క్రేజ్ ను అంచెలంచెలుగా పెంచుతూ వెళ్లాయి. రకుల్ తరువాత అంతే స్పీడ్ తో స్టార్ స్టేటస్ ను అందుకున్న హీరోయిన్ పూజా హెగ్డే అని చెప్పుకోవచ్చు. కీర్తి సురేశ్ .. రష్మిక తనకి దగ్గర్లోనే ఉన్నప్పటికీ, పూజా హెగ్డే కంగారు పడటం లేదు. అందుకు కారణం ఆమె చేతిలో ఉన్న ప్రభాస్ ప్రాజెక్ట్ ఉండటమే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ జోడీగా ఛాన్స్ తగలడం అంతేలికైన విషయమేం కాదు. ఆయనతో కలిసి నటించడానికి బాలీవుడ్ లో ఫుల్ జోష్ తో ఉన్న భామలే పోటీపడుతున్నారు. అలాంటప్పుడు ఆ అవకాశం నేరుగా పూజా హెగ్డే ఇంటికి వెళ్లి 'డోర్ బెల్' కొట్టడం అదృష్టం కాకపోతే మరేమిటి? ప్రభాస్ సరసన నాయికగా ఆమె చేస్తున్న 'రాధే శ్యామ్' ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రొమాంటిక్ మూవీతో తన సక్సెస్ గ్రాఫ్ తారాజువ్వలా దూసుకెళ్లడం ఖాయమని ఆమె భావిస్తోంది. అంతకంటే ముందుగానే ఆమె అఖిల్ తో కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో పలకరించనుందనే విషయం తెలిసిందే. ఇదంతా చూస్తుంటే, ఇప్పట్లో పూజా హెగ్డే దూకుడును ఆపడం కష్టమనేనని అనిపించడం లేదూ .. !