ట్రెండీ టాక్‌: IMAX కెమెరా రెంటు ఎంత?

Update: 2023-07-11 09:46 GMT
త్వ‌ర‌లో విడుద‌ల‌ కు సిద్ధ‌మ‌వుతున్న 'ఓపెన్ హైమ‌ర్' ఇండియా లోను సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. భార‌త‌దేశం లో 3ఏఎం షోల అవ‌కాశాన్ని అందుకున్న ఏకైక నాన్ ఫ్రాంఛైజీ చిత్రం గా ఓపెన్ హైమ‌ర్ రికార్డుల‌కెక్కింది. ఇది అణుబాంబ్ పితామ‌హునిగా పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన రాబ‌ర్ట్ జె జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కింది. అణుబాంబ్ త‌యారీ విస్పోట‌నం నేప‌థ్యంతో నోలాన్ అద్భుతాలు సృష్టిస్తార‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. ఇన్సెప్ష‌న్ - డ‌న్ కిర్క్ - టెనెట్ లాంటి సంచ‌ల‌న చిత్రాల‌ ను తెర‌కెక్కించిన క్రిస్టోఫ‌ర్ నోలాన్ నుంచి వ‌స్తున్న సినిమాగా ఓపెన్ హైమ‌ర్ కి ఎంతో గిరాకీ ఉంది.

నిజాని కి నోలాన్ విరివిగా త‌న సినిమాల్ని IMAX కెమెరా ల‌తో చిత్రీక‌రిస్తార‌నేది ఈ సంద‌ర్భంగా పెద్ద చ‌ర్చ‌గా మారింది. రెగ్యుల‌ర్ కెమెరా ల‌తో పోలిస్తే IMAX తో ప‌ని చేసే అనుభ‌వం ఎంతో మ‌ధురంగా ఉంటుంద‌ని కూడా ఫిలింమేక‌ర్స్ కొంద‌రు చెబుతున్నారు. ఈ కెమెరాతో క్వాలిటీ అసాధార‌ణంగా ఉంటుంది. రొటీన్ కి భిన్న‌మైన ఫిలింమేకింగ్ అనుభ‌వం సాధ్య‌మ‌వుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఓపెన్ హైమర్ ని ఐమ్యాక్స్ కెమెరా లో తెరకెక్కించిన నోలాన్ ఇంత‌కుముందు డన్ కిర్క్ - బ్యాట్ మేన్ ల‌కు ఐమ్యాక్స్ కెమెరా ను ఉప‌యోగించారు. అయితే ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ IMAX కెమెరా ను కొనేందుకు ఎంత ఖర్చు చేయాలి? ధర ఎంత? అనే సందేహాలు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అలాంటి ఒక ఉత్త‌మ కెమెరా ను సొంతం చేసుకోవాల‌ ని అనుకుంటే దీని ఖ‌రీదు చాలా ఎక్కువ అని కొంద‌రు చెబుతున్నారు.

మీరు IMAX కెమెరాతో షూటింగ్ చేస్తారా? అయితే ఎన్ని రోజులు? ఎన్ని ఫిల్మ్ రోల్స్? అనేదానిని బ‌ట్టి ఖ‌ర్చు ఉంటుంద‌ని ఐమ్యాక్స్ కెమెరా తో ప‌ని చేసిన నిపుణుడు ఒక‌రు వెల్ల‌డించారు. IMAX కెమెరా తో షూటింగ్ భారీ ఖర్చుతో కూడుకున్నది అని కొంద‌రు చెబుతుంటే మ‌రికొంద‌రు ఇది చౌక అని కూడా చెబుతున్నారు. వారం రోజుల షూట్ కోసం 15000 డాల‌ర్ల వ‌ర‌కూ అద్దె చెల్లించాల‌ని కొంద‌రు ఫిలింమేక‌ర్స్ వెల్ల‌డించారు. దీనికోసం ఫిల్మ్ రోల్ ని ఉప‌యోగించాలి. 1000 అడుగుల 65mm కొడాక్ ఫిల్మ్ రోల్ దాదాపు 1000 డాల‌ర్లు.

ఈ ఫిల్మ్ రోల్ ని ప్రాసెస్ చేసి స్కాన్ చేయాలి లేదా ప్రింట్ చేయాలి... కాబట్టి మీరు మీ బడ్జెట్ లో ఫిల్మ్ ను IMAXలో షూట్ చేయాల ని ప్లాన్ చేస్తే అది సంక్లిష్టంగా ఉండవచ్చు అని విశ్లేషించారు ఒక నిపుణుడు. కానీ ప్రొడక్షన్స్ లో రాజీకి రాకుండా పెట్టుబ‌డులు పెట్టే నిర్మాత‌ల‌ కు ఈరోజుల్లో కొద‌వేమీ లేదు. నాణ్య‌మైన సినిమా కోసం నిర్మాత‌లు కార్పొరెట్ పెట్టుబడిదారులు ఎంత‌కైనా తెగిస్తున్నారు. అందువల్ల ఐమ్యాక్స్ కెమెరా ల‌తో భ‌విష్య‌త్ లో తెలుగు సినిమాల్ని తెర‌కెక్కించేందుకు ఆస్కారం లేక‌పోలేదు.
 
అద్భుతమైన సినిమాటోగ్రఫీ అనుభవం:

ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ లు తమ తదుపరి హై-ఎండ్ ప్రాజెక్ట్ ని IMAXలో షూట్ చేయమ ని మీరు సిఫార్సు చేస్తారా? అని ఒక ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ మాథ్యూని ప్ర‌శ్నించ‌గా...  అవును అని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డారు. మీరు భరించగలిగితే అలా చేయండి! IMAX షూటింగ్ నా సినిమాటోగ్రాఫర్ జీవితం లో అత్యంత అద్భుతమైన అనుభవాల లో ఒకటి.

నా తోటివారి లో చాలా మంది ఆ అంద‌మైన అనుభూతి ని పొందుతార‌ ని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక అందమైన ఫార్మాట్.. పెద్ద ఫార్మాట్.. పెర్క్ లతో ఫిల్మ్ పెర్క్ లను సృష్టిస్తుంది. కాబట్టి అందమైన స్కిన్ టోన్ లు.. భారీ డైనమిక్ రేంజ్ ... అద్భుతమైన కలర్ రెండిషన్ ను ఈ కెమెరాతో ఆశించవచ్చు అని త‌న అనుభ‌వాల‌ ను వెల్ల‌డించారు.

Similar News