పాన్ ఇండియాలో వెనుకబడుతోన్న ప్రతిభావంతులు!
అనువాద చిత్రంగా బాలీవుడ్ లో రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అలాగే నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరంటే? మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఆ ఛాన్స్ ఉందని విశ్లేషకుల మాట.;
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లు అంటే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ లాంటి స్టార్లు ఉన్నారని చెప్పొ చ్చు. త్వరలో మహేష్ కూడా `వారణాసి`తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. యువ హీరోలు నిఖిల్, తేజ సజ్జా లాంటి వారు కూడా పాన్ ఇండియాలో ఇమేజ్ ఉన్న నటులే. శాండిల్ వుడ్ నుంచి యశ్, రిషబ్ శెట్టిలాంటి వారు పాన్ ఇండియాలో సక్సెస్ అయిన వారే. కోలీవుడ్ నుంచి మాత్రం తర్వాత తరం నటుల్లో పాన్ ఇండియా స్టార్ అంటే ? ధనుష్ ను చెప్పొచ్చు. సౌత్ సహా బాలీవుడ్ లోనూ అతడికి మార్కెట్ ఉంది.
సూర్య ప్రయత్నించినా ఫలించలేదు:
కానీ విక్రమ్, విశాల్, సూర్య, విజయ్ సేతుపతి లాంటి ప్రతిభావంతులు కోలీవుడ్ లో ఉన్నా ఇంకా పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకోలేకపోయారు. సూర్య `కంగువ`తో పాన్ ఇండియా అటెంప్ట్ చేసినా? అది ఫెయిలైంది. దీంతో కొన్నాళ్ల పాటు పాన్ రీజనల్ మార్కెట్ కే పరిమితమని పని చేస్తున్నాడు. ఇక విక్రమ్ అయితే పాన్ ఇండియా ఆలోచనే లేకుండా సినిమాలు చేస్తున్నాడు. భారతదేశ నటుల్లో గొప్ప నటుడిగా పేరున్నా? విక్రమ్ మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. `తంగలాన్` లాంటి యూనివర్శల్ చిత్రంలో నటించినా అది కోలీవుడ్ కే పరిమితమైంది.
పాన్ ఇండియా వైపు చూడటమే లేదే:
అనువాద చిత్రంగా బాలీవుడ్ లో రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అలాగే నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరంటే? మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఆ ఛాన్స్ ఉందని విశ్లేషకుల మాట. కానీ అతడు కూడా కోలీవుడ్ సహా కీలక పాత్రల్లో నటించడం తప్ప! ఇండియా వైడ్ మార్కెట్ ను విస్తరించలేకపోతున్నాడు. బాలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా? అవి కీలక పాత్రలు మాత్రమే. విశాల్ కూడా గొప్ప నటుడు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలడు. కానీ అతడు కూడా కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. కార్తీ సౌత్ మార్కెట్ టార్గెట్ గానే సినిమాలు చేస్తున్నాడు.
2026 లోనైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా?
స్పై థ్రిల్లర్ `సర్దార్ 2` బాలీవుడ్ మార్కెట్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. రీజనల్ మార్కెట్ కే పరిమితం చేస్తున్నారు. ఈ హీరో కూడా ప్రయోగాలకు ఎంత మాత్రం వెనుకాడడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. తల అజిత్ కూడా తమిళ భాషను వదిలి బయటకు రావడం లేదు. పనిచేస్తే కోలీవుడ్ లోనే లేదంటే రిటైర్మెంట్ అనే మాట తప్ప! పాన్ ఇండియా మార్కెట్ వైపు చూడటం లేదు. మరి ఈ ప్రతి భావంతులంతా కొత్త ఏడాది 2026 లోనైనా కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారా? అలాగే కొనసాగుతారా? అన్నది చూద్దాం.