పండక్కి వచ్చే హీరోయిన్లు అంతా ప్లాప్ ల్లోనే!
ప్రచారమంటే కనిపించని నయనతార ఇంత హడావుడి చేస్తుందని చాలా మంది లో సందేహం ఉండేది. కానీ అసలు సంగతి హిట్ కోసం పడే తాపత్రయం అన్నది తేలింది.;
నయనతార, మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్, మాళవికా మోహన్, పూజాహెగ్డే, డింపుల్ హయతి లాంటి భామలు ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి షురూ చేస్తున్నారు. చిరంజీవి కి జోడీగా నయనతార `మన శంకరవరప్రసాగారు`లో నటిస్తోంది. నయన్ కు సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. `జవాన్` తర్వాత అమ్మడు నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. కమర్శియల్ చిత్రాలు మినహా ఉమెన్ సెంట్రిక్ చిత్రం ఫెయిలైంది. దీంతో చిరు సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీలాంచ్ ప్రమోషనల్ కూడా అమ్మడు ఎంతో యాక్టివ్ గా పాల్గొంది.
ప్రచారమంటే కనిపించని నయనతార ఇంత హడావుడి చేస్తుందని చాలా మంది లో సందేహం ఉండేది. కానీ అసలు సంగతి హిట్ కోసం పడే తాపత్రయం అన్నది తేలింది. మీనాక్షి చౌదరి ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` తో హిట్ అందుకున్నా? క్రెడిట్ అంతా ఐశ్వర్యా రాజేష్ కొట్టేసింది. మెయిన్ లీడ్ ఐశ్వర్య కావడంతో? సక్సెస్ వచ్చినా మీనాక్షి లో సంతోషం కనిపించలేదు. దీంతో సోలో సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. యువ హీరో నవీన్ పోలిశెట్టికి జోడీగా `అనగననగా ఒక రాజు`లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుంది.
పోటీ ఉన్నా? వెనక్కి తగ్గడం లేదు. వరుస ప్లాప్ ల్లో ఉన్న నిధి అగర్వాల్ కు `హరి హర వీరమల్లు` తోనైనా ఊరట దక్కుతుంది అనుకుంటే? అది జరగలేదు. దీంతో అమ్మడి ఆశలన్నీ రాజాసాబ్ పైనే పెట్టుకుంది. సినిమాపై మంచి అంచనాలున్న నేపథ్యంలో? హిట్ పై ధీమాగా ఉంది. ఇదే సినిమాతో మాళవిక మోహన్ టాలీవుడ్ కి పరిచయమ వుతోంది. టాలీవుడ్ లో డెబ్యూతో తిరుగులేని స్టార్ అవుతాను అన్న ధీమాతో అమ్మడు కనిపిస్తోంది. `రామబాణం` తర్వాత ఖాళీగా ఉన్న తెలుగు నటి డింపుల్ హయతి కూడా రవితేజ సినిమాపై చాలా ఆశలే పట్టుకుంది.
రవితేజకు జోడీగా `భర్త మహాశయులకు విజ్ఞప్తి`లో నటిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో సినిమా సక్సస్ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ హిట్ తోనైనా టాలీవుడ్ లో ఛాన్సులొస్తాయని భావిస్తోంది. అలాగే ముంబై బ్యూటీ పూజాహెగ్డే `జన నాయగన్` తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. విజయ్ హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రమిది. బాలీవుడ్ నుంచి కంబ్యాక్ అయిన తర్వాత రిలీజ్ అయిన చిత్రాలేవి కలిసి రాలేదు. దీంతో `జన నాయగన్` విజయంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఎదురు చూస్తోంది.