ఇక‌పై హీరోలంతా త‌ప్ప‌క చెక్ చేసుకోవాల్సిందే!

ఆ సంస్థ‌కంటూ ఓ రిపిటేష‌న్ ఉంటుంది కాబ‌ట్టి హీరోలు ధీమాగా సినిమాలు చేయ‌డానికి ముందుకొస్తారు. కానీ ఏ పుట్ట‌లో ఏ పాముందో? బ‌య‌ట‌కు వ‌స్తేనే గా తెలిసేది.;

Update: 2025-12-10 20:30 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ తొలి పాన్ ఇండియా చిత్రం `అఖండ 2` రిలీజ్ ఎంత పెద్ద షాక్ ఇచ్చిందో తెలిసిందే. స‌రిగ్గా రిలీజ్ కు కొన్ని గంట‌ల ముందే? రిలీజ్ కు వీల్లేదంటూ కోర్టు షాక్ ఇవ్వ‌డంతో? బాల‌య్య కంగు తిన్నారు. కొన్ని గంట‌ల పాటు ఎం జ‌రుగుతుందో అర్దం కాలేదు. ఐదు దాశాబ్దాల బాల‌య్య కెరీర్ లో తొలిసారి ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైంది. రిలీజ్ ఆగిపోవ‌డం అన్న‌ది బాల‌య్య‌కు ఎంతో ప్ర‌తిష్ట‌తో కూడిన విష‌యం. దీంతో ఆయ‌న ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌పై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి.

హీరోలు బీ అలెర్ట్:

ఇదంతా పూర్తిగా నిర్మాత‌ల త‌ప్పిదం కార‌ణంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌. ఎన్నో సినిమాలు నిర్మించారు. వాళ్ల సినిమా రిలీజ్ ఆగిపోవ‌డం ఏంటి? అని అంతా షాక్ అయ్యారు. కానీ సంస్థ వెనుక చెప్పుకోలేని కార‌ణాలు ఎన్నో ఉంటాయ‌ని మొన్న‌టి ఘ‌ట‌నతో అర్ద‌మైంది. దీంతో స్టార్ హీరోలంతా ఇక‌పై అలెర్ట్ అవ్వాల్సిందే. షూటింగ్ పూర్తి చేసేసాం. మా పారితోషికం అందేసింది. రిలీజ్ అయిపోతుందులే అని ధీమాగా ఉంటే బాల‌య్య లా షాక్ అవ్వ‌క‌ త‌ప్ప‌దు. సాధార‌ణంగా అగ్ర నిర్మాణ సంస్థ‌ల విష‌యంలో రిలీజ్ ఆగిపోవ‌డం అన్న‌ది జ‌ర‌గ‌దు.

న‌మ్మ‌కంతో హీరోలు ముందుకు:

ఆ సంస్థ‌కంటూ ఓ రిపిటేష‌న్ ఉంటుంది కాబ‌ట్టి హీరోలు ధీమాగా సినిమాలు చేయ‌డానికి ముందుకొస్తారు. కానీ ఏ పుట్ట‌లో ఏ పాముందో? బ‌య‌ట‌కు వ‌స్తేనే గా తెలిసేది. సినిమా నిర్మాణంలో కోట్లు గ‌డించిన నిర్మాత‌లు ఉన్నారు. అప్పులు పాలై రోడ్డున ప‌డ్డ నిర్మాత‌లు ఎంతో మంది. సినిమా అనేది ఓ జూదం లాంటింది. హిట్ అనే ఉత్సాహం మ‌రో సినిమాకు అడుగులు వేయిస్తుంది. సంపాదించిందంతా ఆ సినిమాపై పెడ‌తారు. హిట్ అయితే లాభాలు..ప్లాప్ అయితే న‌ష్టాలు. ఆ న‌ష్టాల‌ను పూడ్చ‌డానికి పైనాన్స‌ర్లు, బ్యాంకుల‌పై నిర్మాత‌లు ఆధార‌ప‌డ‌టం.

ఎన్నో ఒప్పందాల న‌డుమ సినిమా:

నిర్మాణం అన్న‌ది ఓ సైక్లిక్ ప్రోస‌స్. ర‌క‌ర‌కాల ఒప్పందాల నడుమ న‌డుస్తోంది. ఆ ఒప్పందంలో ఎక్క‌డా తేడా కొట్టినా? రాత్రికి రాత్రే సీన్ మారిపోతుంది. తాజా సంఘ‌ట‌నే తీసుకుంటే? `అఖండ 2` నిర్మాణ సంస్థ‌ 14 రీల్స్ `దూకుడు`తోమంచి లాభాలు చూసింది. త‌ర్వాత అదే సంస్థ‌కు మ‌హేష్ తో తీసిన `వ‌న్` -` ఆగ‌డు` రూపంలో రెండు డిజాస్ట‌ర్లు ఎదుర‌య్యాయి. ఈ రెండు సినిమాల విష‌యంలో ఎరోస్ సంస్థ‌తో 14 రీల్స్ వాళ్ల‌కు లావాదేవీలు ఉన్నాయి.అవి క్లీయ‌ర్ కాలేదు. అవి క్లియ‌ర్ చేసే వ‌ర‌కూ రిలీజ్ కు వీలు లేదంటూ ఏరోస్ కోర్టుకెక్క‌డంతో? `అఖండ‌2` రిలీజ్ కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

Tags:    

Similar News