లేత సోయగాలతో ఆకట్టుకుంటున్న శ్రీలీలా.. ఫోటోలు వైరల్!
తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలకు విభిన్నమైన ఫోజులిచ్చింది.;
యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల వణికించే చలిలో కూడా తన అందంతో.. లేత సోయగాలతో చెమటలు పట్టిస్తోంది.. శ్రీలీలకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు హాట్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలకు విభిన్నమైన ఫోజులిచ్చింది. శ్రీలీల హాట్ ఫోజులకు చాలా మంది నెటిజన్లు ఫైర్ ఏమోజీస్ ని షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో శ్రీలీల అందం తళుక్కున మెరుస్తోంది. క్యూట్ స్మైల్ తో.. కట్టిపడేసే అందంతో శ్రీలీల తన అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.
తాజా ఫోటోలలో శ్రీలీల అందం చూసిన చాలామంది నెటిజెన్లు వణికే చలిలో కూడా చెమటలు పట్టిస్తున్నావ్.. మరీ ఇంత అందాన్ని తట్టుకోలేకపోతున్నాం.. శీతాకాలంలో కూడా చెమటలు పడుతున్నాయి అంటే అది శ్రీలీల అందం మహిమే అంటూ వైరల్ కామెంట్స్ పెడుతున్నారు.. అలా శ్రీలీల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్టైలిష్ డ్రెస్సులు వేసుకుంటూ ట్రెండీ ఫోజులిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అలా తాజా ఫొటోలు శ్రీలీల అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఫోటోలకు "నా అట్లాస్ ఈ రాత్రికి డల్లాస్ ని ఎంచుకుంది" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.
శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. ఈమె నటించిన సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా సరే మళ్లీ చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ,మలయాళం ఇలా అవకాశం వచ్చిన ప్రతి ఒక్క భాషలో నటిస్తూ చిన్న వయసులోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి శ్రీలీల నటించిన తాజా మూవీ పరాశక్తి.. తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన పరాశక్తి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కాబోతుంది.
ఇక రీసెంట్ గానే మాస్ జాతర మూవీ తో మరో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీల పరాశక్తి మూవీతో మళ్లీ మన ముందుకు రాబోతోంది. ఈ హీరోయిన్ నుండి రాబోయే సినిమాల విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేస్తోంది. అలా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన డాక్టర్ చదువును కూడా పూర్తి చేస్తోంది.