కేజీఎఫ్ స్టార్.. పోటీలోనే ఉన్నాడు బాస్
ముందు ప్రకటించినట్లు మార్చి 19న ‘టాక్సిక్’ రావడం కష్టమే అని.. వాయిదా అనివార్యమని జోరుగా ప్రచారం జరిగింది. ఆ డేట్‌కు పోటీగా వేరే సినిమాలను అనౌన్స్ చేయడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.;
కన్నడలో ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడిగా ఉన్న యశ్ గురించి ఇతర భాషల వాళ్లకు పెద్దగా తెలియదు. కానీ ‘కేజీఎఫ్’ అనే చిత్రం పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయి తనకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్, మార్కెట్ తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్-2’ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయి యశ్‌ను పాన్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడిగా చేసింది. ఐతే ఇంత పెద్ద సక్సెస్‌లు అందుకున్నాక తర్వాతి సినిమా ఆషామాషీగా ఉంటే కష్టం. అందుకే అతను ఆచితూచి అడుగులు వేద్దామనుకున్నాడు.
కానీ అది కాస్తా అతి జాగ్రత్తగా మారి తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి చాలా టైం పట్టేసింది. ఏవేవో ప్రాజెక్టులు అనుకుని.. చివరికి మలయాళ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్‌తో ‘టాక్సిక్’ సినిమాను మొదలుపెట్టాడు యశ్. ఐతే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ టీజర్, ఇతర పోస్టులు అంతగా ఆకట్టుకోలేదు. సినిమాకు హైప్ రాలేదు. దీనికి తోడు ఔట్ పుట్ బాగా లేదని.. రీషూట్లు జరుగుతున్నాయని.. గీతను పక్కకు తప్పించి యశ్‌యే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాయని.. ఇలా రకరకాల నెగెటివ్ రూమర్స్ వచ్చాయి.
ముందు ప్రకటించినట్లు మార్చి 19న ‘టాక్సిక్’ రావడం కష్టమే అని.. వాయిదా అనివార్యమని జోరుగా ప్రచారం జరిగింది. ఆ డేట్‌కు పోటీగా వేరే సినిమాలను అనౌన్స్ చేయడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. కానీ తమ సినిమాల చుట్టూ ముసురుకున్న అనుమానాలకు తెరదించుతూ కొత్త పోస్టర్ వదిలింది ‘టాక్సిక్’ టీం. మార్చి 19నే రిలీజ్ అని పేర్కొంటూ వంద రోజుల కౌంట్ డౌన్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు. యశ్ బ్యాక్ లుక్‌తో పవర్ ఫుల్‌గా కనిపిస్తోందీ పోస్టర్. సినిమాను వాయిదా వేసేట్లయితే.. ఈపాటికే టీం ఒక క్లారిటీతో ఉండుండాలి.
అది ఈద్ వీకెండ్ కావడంతో తమ సినిమా పోటీ లేదంటే ఇప్పుడే స్పష్టత ఇవ్వాలి. ఆ టైంలో సల్మాన్ ఖాన్ సినిమా కూడా వస్తుందన్న సంకేతాలు ఉన్నప్పటికీ.. ‘టాక్సిక్’కు అదే రిలీజ్ డేట్ ఖరారు చేశారంటే టీం వెనక్కి తగ్గట్లేదన్నమాటే. అంతేకాక సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నారనడానికి కూడా ఇది సంకేతం. ఈ పోస్టర్ యశ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. మరి ‘కేజీఎఫ్’ తర్వాత తనపై పెరిగిన భారీ అంచనాలను యశ్ ఎంతమేర అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూరే సంగీతం అందిస్తుండగా.. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.