సుమతీ శతకం ట్రైలర్: సుమతీ కోసం అమర్ దీప్ అల్లరి

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త దర్శకులు, నటీనటులు విభిన్నమైన కథలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.;

Update: 2026-01-29 17:56 GMT

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త దర్శకులు, నటీనటులు విభిన్నమైన కథలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యం, కామెడీ, ఎమోషన్స్ కలగలిపిన చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అమర్ దీప్ చౌదరి హీరోగా వస్తున్న 'సుమతి శతకం' సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఇక లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కంప్లీట్ విలేజ్ డ్రామాను తలపిస్తోంది.




​ఈ ట్రైలర్ ఆరంభంలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా చూపించారు. చిన్నప్పటి నుంచి చదువుకన్నా పెళ్లి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కుర్రాడిగా హీరో కనిపిస్తున్నాడు. సింపుల్ గా ఉన్న డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఊరిలో ఉండే ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు, తన పెళ్లి కోసం పడే పాట్లు, ఆ క్రమంలో ఎదురయ్యే సరదా సంఘటనలతో మొదటి సగం సరదాగా సాగిపోతుంది.

​ఇక కథలోకి వెళ్తే, హీరో ఒక అంగన్వాడీ కేంద్రానికి సరుకులు సరఫరా చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. అక్కడ సుమతి అనే అమ్మాయితో ప్రేమలో పడటం, ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నాలు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే ఈ సరదా కథలోకి ఒక సీరియస్ పాయింట్ ఎంటర్ అవుతుంది. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం మాయమవ్వడం అనే అంశం చుట్టూ కథ మలుపు తిరుగుతుంది. ఊరి సమస్యకు, హీరో పెళ్లికి మధ్య ఉన్న లింక్ ఏంటనేది హైలెట్ చేసి చూపించారు.

​ట్రైలర్ సెకండ్ హాఫ్ అంతా కాస్త సీరియస్ గా, యాక్షన్ మోడ్ లో సాగింది. విగ్రహం దొరకకపోతే ఊరు చీకట్లో బతకాల్సిందే అని ఊరి పెద్దలు చెప్పడం, హీరో ఆ విగ్రహాన్ని వెతకడానికి చేసే పోరాటం వంటి సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా చూపిస్తున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. విలేజ్ పాలిటిక్స్, సెంటిమెంట్ కలగలిసిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లా ఈ సినిమా కనిపిస్తోంది.

​నటీనటుల విషయానికి వస్తే, అమర్ దీప్ తన పాత్రలో చాలా ఒదిగిపోయారు. పల్లెటూరి కుర్రాడి బాడీ లాంగ్వేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేశారు. కామెడీ సీన్స్ లో టైమింగ్ బాగుంది, అలాగే సీరియస్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించారు. హీరోయిన్ సాయ్లిమ్ చౌదరి కూడా తన లుక్స్ తో ఆకట్టుకుంది. టేస్టీ తేజ, మహేష్ విట్టా, జేడీవి ప్రసాద్, మిర్చి కిరణ్.. అలాగే ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసినట్లు కనిపిస్తోంది. దర్శకుడు ఎం.ఎం. నాయుడు ఒక పల్లెటూరి తరహా కథను ఎంచుకుని, దాన్ని నేటి తరం అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

​సినిమా సక్సెస్ విషయంలో హీరో అమర్ దీప్ పై భారీ అంచనాలే ఉన్నాయి. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్, బిగ్ బాస్ వంటి రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన, ఈ 'సుమతి శతకం' ద్వారా వెండితెరపై ఎలాంటి క్రేజ్ అందుకుంటారో చూడాలి.


Full View


Tags:    

Similar News