• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంకా ఎంత టైం కావాలి...

ఇంకా ఎంత టైం కావాలి విశ్వంభరా?

| ‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సినిమా ‘విశ్వంభర’నే. 2025 సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాను మొదలుపెట్టారు.

By - Garuda Media
Update: 2026-01-29 13:30 GMT

‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సినిమా ‘విశ్వంభర’నే. 2025 సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాను మొదలుపెట్టారు. చకచకా షూటింగ్ కూడా పూర్తి చేశారు. మేకింగ్ దశలో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది కూడా. కానీ టీజర్ రిలీజ్ చేశాక అంతా మారిపోయింది. సబ్‌స్టాండర్డ్ విజువల్స్, ఎఫెక్ట్స్ కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. టీం ఆత్మరక్షణలో పడిపోయింది.

దీంతో రిలీజ్ వాయిదా వేసి.. విజువల్ ఎఫెక్ట్స్ మీద మళ్లీ పని చేయడం మొదలు పెట్టింది టీం. ఇలా వీఎఫెక్స్ మీద రీవర్క్ చేయడం మొదలుపెట్టి ఏడాది దాటిపోయింది. చాలా నెలల పాటు అసలు టీం నుంచి ఏ అప్‌డేట్ కూడా లేదు. ఐతే గత ఏడాది అందరిలోనూ అయోమయం నెలకొన్న సమయంలో టీం ఒక స్పష్టతనిచ్చింది.

చిరు తర్వాత మొదలుపెట్టిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రానికి సైడ్ ఇస్తూ.. తమ సినిమాను 2026 వేసవికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను పక్కన పెట్టి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మీద ఫోకస్ చేశారు. ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్నీ అందుకుంది. ఆ తర్వాత ‘విశ్వంభర’ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. చెప్పిన ప్రకారమే వేసవిలో సినిమా రిలీజవుతుందని ఆశిస్తుంటే.. ఇప్పుడు మళ్లీ జులై 10 అంటూ కొత్త డేట్ తెరపైకి వచ్చింది.

దీంతో మళ్లీ మాట తప్పడం ఏంటి.. వేసవి లాంటి క్రేజీ సీజన్‌ను ఎందుకు వదిలేస్తున్నారు.. ఇలా మళ్లీ మళ్లీ వాయిదా వేస్తే సినిమాకు హైప్ మరింత తగ్గిపోదా.. ఇప్పటికీ సినిమా మీద టీంకు గురి కుదరలేదా.. వీఎఫెక్స్ మీద మళ్లీ పని చేసినా ఔట్ పుట్ మెరుగుపడలేదా.. అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈసారి మళ్లీ వాయిదా వేయడానికి కారణమేంటో చెప్పడమో.. లేదంటే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఒక మంచి గ్లింప్స్ రిలీజ్ చేసి మళ్లీ కాన్ఫిడెన్స్ నింపడమో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
  • vishwambhara 
  • chiranjeevi 
  • vishwambharadelay 
  • july10release 
  • manashankaravaraprasadgaru 
  • tollywood 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS