ఆ నటుడిలా నిర్దోషిగా బయటకొస్తాడనే నమ్మకంతోనా!
ఈ సినిమా విషయంలో ఎలాంటి నెగిటివిటీ కూడా స్ప్రెడ్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకాభిమానులు దర్శన్ ని నిర్దోషిగా భావిస్తున్నారా? అన్న సందేహాలు కొందరిలో కలుగుతున్నాయి.;
కన్నడ నటుడు దర్శన్ మర్డర్ కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అదీ తనని అభిమానించిన నటుడ్నే హత్య చేసాడు? అన్న ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దర్శన్ అరెస్ట్ అయిన క్రమంలో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు మద్దతుగానూ నిలిచారు. తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేసారు. ఇంకొం దరు నిజంగా తప్పు చేస్తే? శిక్ష తప్పదు అన్నట్లు వ్యాఖ్యానించారు. ఏదైనా తప్పొప్పులు తేల్చాల్సింది కోర్టు, జైలు కాబట్టి! ఇది ఆ ఫరదిలో అంశం. ఆ సంగతి పక్కన బెడితే? దర్శన్ నటించిన `డెవిల్` మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది.
సినిమాకు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఐదు కోట్ల గ్రాస్ రాబట్టింది. రిలీజ్ అవుతోన్న థియేటర్లు అన్నింటి కొత్త పెళ్లి కూతురులా అలంకరించారు. ఈ సన్నివేశం చూసి దేశ ప్రజలంతా నోరెళ్లబెడుతున్నారు. జైల్లో ఉన్న ఖైదీ సినిమాకు ఇంత హడావుడి ఏంటనే చర్చ జరుగుతోంది. రిలీజ్ కు ముందే ఇంత హడావుడి నెలకొంది అంటే? రిలీజ్ తర్వాత హిట్ టాక్ తెచ్చుకుంటే? ఇంకే రేంజ్లో హైప్ ఉంటుందో ఊహకే అందదేమో. దీంతో సినిమా నటుడు అంటే? జైల్లో ఉన్నా ఒకటే? బయట ఉన్నా ఒకటే అన్న డిస్కషన్ షురూ అయింది.
ఈ సినిమా విషయంలో ఎలాంటి నెగిటివిటీ కూడా స్ప్రెడ్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకాభిమానులు దర్శన్ ని నిర్దోషిగా భావిస్తున్నారా? అన్న సందేహాలు కొందరిలో కలుగుతున్నాయి. ఇంకొంత మంది ఈ కేసుతో సంబంధం లేకుండా సినిమాను సినిమాగా మాత్రమే చూస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం దర్శన్ ఆరోపణలు మాత్రమే ఎదుర్కుంటున్నాడు. కేసులో అతడు దోషి అని తేలలేదు. ఆ కోణంలో అభిమానుల్ని దర్శన్ ట్రీట్ చేస్తున్నారు? అన్నది కాదనలేని నిజం. ఇటీవలే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళ నటుడు దిలీప్ కుమార్ నిర్దోషిగా బయటకొచ్చిన సంగతి తెలిసిందే.
తొమ్మిదేళ్ల పాటు విచారణ ఎదుర్కొన్న దిలీప్ కుమార్ ని నిర్దోషిగా తేల్చి క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీలీప్ కుమార్ తనను కేసులో ఇరికించిన వారిపై న్యాయ పరమైన చర్యలకు దిగుతున్నాడు. అయితే దర్శన్ విషయంలో పోలీసులు కోర్టుకు సమర్పించి సాక్షాలన్నీ అతడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ కేసు నుంచి దర్శన్ బయట పడటం కష్టమని పోలీస్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. సుప్రీ కోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేసి రిమాండ్ కి ఆదేశించిన వైనం తెలిసిందే.