ఆఫీసుల్లో ఫ్రీమీల్స్ తిని హీరోయిన్ అయ్యింది!
డాక్టర్ కావాలని యాక్టర్ అయిన వాళ్లు ఉన్నారు. కానీ ఆర్కిటెక్ట్ లేదా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుని అటుపై హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది నిత్యా నరేష్. ఆరంభం ఓ వాణిజ్య ప్రకటనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి అటుపై కథానాయికగా ప్రమోటైపోయింది. సెయింట్ జేవియర్స్ ముంబైలో పీజీ ఫిలింమేకింగ్ కోర్స్ చేసిన ఈ బ్యూటీ తెర ముందుకు రావడం అనూహ్యం. దేవుడు నిర్ణయించిన డెస్టినీని ఫాలో అవుతున్నానని చెప్పింది.
తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి బాంబేలో సెటిలయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నిత్యా నరేష్ ఆ తర్వాత డెస్టినీ డిసైడ్ చేసి నటి అయ్యిందట. థియేటర్ ఆర్టిస్టుని .. కానీ సినిమా నటన వేరు. తెలుగు పరిశ్రమ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. సాయి కిరణ్ అడవి `కేరింత`లో తొలి అవకాశం వచ్చింది. ఆ తర్వాత `నందిని నర్సింగ్ హోమ్` .. `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రైజింగ్ స్టార్ నాగశౌర్య సరసన అవకాశం అందుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శౌర్య సరసన ఏ సినిమాలో? అన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం శౌర్య వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొత్తానికి మెయిన్ స్ట్రీమ్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంటోంది. పీజీ డిగ్రీ అందుకుని ఆఫీసుల్లో ఫ్రీమీల్స్ తినేస్తూ అలా అవకాశాల కోసం ప్రయత్నించానని నిజాయితీగా చెప్పుకునే ఈ అమ్మడు... ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తోంది. హీరోయిన్ అవ్వాలనుకుని అవ్వలేదు కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. ప్రాక్టికల్ గోల్స్ పెట్టుకోవాలని చెబుతుంటారు. అసలు సినీనేపథ్యం లేదు. కానీ హీరోయిన్ గా ఎదిగేస్తోంది మరి.