• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అఖండ' తర్వాత డేట్ ఫిక్స్...

'అఖండ' తర్వాత డేట్ ఫిక్స్ చేసిన బాలయ్య

By - Tupaki Desk
Update: 2021-08-17 10:30 GMT
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసింది. బోయపాటి.. బాలయ్యల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో విడుదల తేదీ విషయమై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఇప్పట్లో అఖండ విడుదల తేదీపై ఒక స్పష్టత వచ్చేలా లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదల లేకుంటే దసరా సీజన్ లో ఈ సినిమా వస్తుందేమో అంటూ నెటిజన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖండ సినిమా విడుదల విషయంలో స్పష్టత రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమాను బాలయ్య పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే వీరి కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్‌ 1 న పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. షూటింగ్‌ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్టోబర్‌ లో షూటింగ్‌ ను మొదలు పెట్టి కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్‌ ను ముగించేయాలని గోపీచంద్‌ మలినేని భావిస్తున్నాడట. ఈ సినిమా కోసం ఒక రియల్‌ లైఫ్ సంఘటనను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన క్రాక్‌ సినిమా ను కూడా రియల్‌ లైఫ్‌ సంఘటనల ఆధారంగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన విషయం తెల్సిందే. అందుకే ఈసారి కూడా తప్పకుండా గోపీచంద్‌ మలినేని తనదైన యాక్షన్‌ మాస్ సినిమా ను బాలయ్య తో తెరకెక్కించడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. గోపీచంద్‌ మలినేని కాంబోలో ఇప్పటికే బాలయ్య సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు వచ్చిన ఆఫర్‌ ను దర్శకుడు వినియోగించుకోవాలి.

క్రాక్‌ సక్సెస్ తర్వాత గోపీచంద్‌ మలినేని నుండి మంచి క్రేజ్ ఉన్న సినిమా రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగా మంచి కథను దర్శకుడు రెడీ చేశాడు. బాలయ్య కు అఖండతో మునుపటి వైభవం రాబోతుంది. వరుసగా ప్లాప్ లు పడ్డ నేపథ్యంలో ఆయన కాస్త కథల విషయంలో శ్రద్ద పెట్టి మంచి కథలు ఎంపిక చేస్తున్నాడు. అఖండ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక మంచి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ను చేయబోతున్నాడు. ఆ వెంటనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమాను కొన్ని కారణాల వల్ల కొన్నాళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఎఫ్‌ 3 తర్వాత అనీల్‌ రావిపూడి చేయాల్సిన సినిమా బాలయ్య తో అనే క్లారిటీ వచ్చేసింది.

వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా అనీల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నాడు. బాలకృష్ణ అఖండ సినిమా విడుదల అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ భారీ యాక్షన్‌ ఎంటర్ టైన్‌ మెంట్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బాలయ్య ఏడాదికి రెండు మూడు సినిమాలు అన్నట్లుగా వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతూనే ఉన్నాడు. అనీల్ రావిపూడి సినిమా తర్వాత మోక్షజ్ఞతో కలిసి ఆదిత్య 369 సీక్వెల్‌ ను చేయబోతున్నట్లుగా స్వయంగా బాలయ్య ప్రకటించాడు. మొత్తానికి నందమూరి అభిమానులకు ఊపిరి మెసలకుండా బ్యాక్ టు బ్యాక్‌ ఎంటర్‌ టైన్ మెంట్‌ ను బాలయ్య ఇవ్వనున్నాడు. హీరోగా నటించడంతో పాటు ఆదిత్య 369 సీక్వెల్‌ కు స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడట.




Tags:    
  • Gopichand Malineni 
  • BalaKrishna 
  • Latest Movie Upadates 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS