• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ టాలీవుడ్ గబ్బర్ ఈజ్...

మళ్లీ టాలీవుడ్ గబ్బర్ ఈజ్ బ్యాక్.. రిపీట్!

By - Tupaki Desk
Update: 2020-05-11 17:00 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమాలో ‘గబ్బర్ సింగ్.. గబ్బర్‌సింగ్..హీస్ ఆన్ ది వే టు డు సంథింగ్' ముందుకొచ్చి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో చేసిన అన్నీ సినిమాలకు దేవీశ్రీ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. వీరి కాంబోలో మ్యూజిక్ పరంగా అన్నీ భారీ హిట్సే. ఇప్పుడు మరోసారి పవన్‌తో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు దేవి. మాస్ బీట్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను మరోసారి ఊపేస్తానంటున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ తన 28వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడని హరీష్ శంకర్ తెలిపారు.

2012 మే 11న.. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ సరిగ్గా నేటికీ ఎనిమిదేళ్లను పూర్తిచేసుకుంది. వరుస డిజాస్టర్లతో వెనకబడిన పవర్ స్టార్‌ను మళ్లీ ఫాంలోకి తీసుకొచ్చిన సినిమా ఇది. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది. అందుకే ‘గబ్బర్‌సింగ్’ విడుదలైన రోజే అంటే ఈరోజే దర్శకుడు హరీష్ శంకర్.. పవన్‌తో చేయబోయే తన తరవాత సినిమా గురించి ట్విట్టర్ వేదికగా కొత్త సమాచారం ఇచ్చారు. ‘‘ఇది ఒక అద్భుతమైన రోజు. 8 సంవత్సాల క్రితం విడుదల తేదీ ఇప్పటికి పవర్ఫుల్ రోజుగా గుర్తుంది. ఈసారి కూడా దేవి నేను కలిసి గబ్బర్ సింగ్ మ్యూజికల్ ఎనర్జీని మరోసారి క్రియేట్ చేయడానికి వస్తున్నామని తెలిపాడు. ఇక ఈ విషయం ప్రకటించడానికి ఇంత కన్నా గొప్ప రోజు ఏముంటుంది. పవన్ కళ్యాణ్ 28వ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. మేం మళ్లీ వస్తున్నాం.. ఇప్పుడే మొదలైంది’’ అని హరీష్ శంకర్ తన ట్వీట్‌ ద్వారా తెలిపాడు. ఇక రెండోసారి పవన్, హరీష్, దేవీల కాంబో రిపీట్ కానుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • pawan kalyan 
  • harish shankar 
  • Devisri Prasad 
  • Gabbarsingh Combo 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS