ట్రైలర్ టాక్: కామెడీతోపాటు తండ్రీకొడుకుల ఎమోషన్ కలబోసిన 'గాలి సంపత్'
యంగ్ హీరో శ్రీ విష్ణు - నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ''గాలి సంపత్". 'అలా ఎలా' ఫేమ్ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. షైన్ స్క్రీన్స్ మరియు ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది - ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్ ని విడుదల చేసి చిత్ర యూనిట్ కి విషెస్ అందించారు.
'పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి, పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది' అంటూ హీరో శ్రీవిష్ణు చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ప్రమాదవశాత్తు మాట కోల్పోయిన సంపత్.. గాలి ద్వారా ఫిఫీ భాష మాట్లాడటం వల్ల అతన్ని గాలి సంపత్ అని పిలుస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ వల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాటలు రాని తండ్రి, అనుకోకుండా ఓ బావిలో పడటం.. తండ్రిని వెతికే సమయంలో కొడుకు పడే వేదనను ఇందులో చూపించారు. గాలి సంపత్ ఆ బావిలో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ అని తెలుస్తోంది.
'ప్రపంచంలో ఏ తండ్రి అయినా తన కొడుకు తనకంటే నాలుగు మెట్లు ఎదగాలని చూస్తాడు.. నువ్వేంటి నాన్నా నన్ను తొక్కి ఎదగాలని చూస్తున్నావ్' అంటూ మిర్చి కిరణ్ రాసిన సంభాషణలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. దీనికి అచ్చు రాజమణి సమకూర్చిన నేపథ్య సంగీతం.. సాయి శ్రీరామ్ అందించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎస్. క్రిష్ణ స్టోరీ అందించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించారు. లవ్ లీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి - సత్య - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - మిర్చి కిరణ్ - సురేంద్ర రెడ్డి - గగన్ - మిమ్స్ మధు - అనీష్ కురువిల్లా - రజిత - కరాటే కళ్యాణి - సాయి శ్రీనివాస్ - రూప లక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మొత్తం మీద కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్ కలబోసిన ''గాలి సంపత్'' ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
Full View